రజనీ పార్టీ సింబల్ వెనుక సీక్రెట్ ఇదే...

Publish Date:Jan 5, 2018

Advertisement

 

ఊరిస్తూ.. ఊరిస్తూ.. ఎలాగో తాను రాజకీయాల్లోకి వస్తున్నా అని తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పేశారు. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అభిమానుల కోరికను ఎట్టకేలకు రజనీకాంత్ నిజం చేశారు. ఇక అందరిలాగానే... దేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని.. వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని.. డబ్బు, పదవి మీద ఆశతో మాత్రం రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పుకొచ్చారు. ఇక్కడివరకూ బాగానే ఉంది. ఇప్పటివరకూ రజనీ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారబ్బా అని చర్చలు జరిగేవి. ఇప్పుడు ఎలాగూ క్లారిటీ వచ్చేసింది కాబట్టి.. ఆ ఎపిసోట్ అయిపోయింది.

 

ఇప్పుడు పార్టీ సింబల్ పై చర్చలు మొదలయ్యాయి. ముందు చాలా స్టైల్ గా పిడికిలి బిగించి చూపుడు వేలు..చిటికెన వేలు మాత్రమే పైకి లేపిఉంచి బాబా అనే సింబల్ ను పార్టీ గుర్తుగా పెట్టారు. ఈ గుర్తు అయితే ఆధ్యాత్మిక భావన కలుగ చేస్తుంది.. అంతేకాదు తమిళ ప్రజలకి ఈ గుర్తు ఎంతో ప్రాచుర్యం పొందింది కూడా.. అందులో తామరపువ్వు కూడా ఉంది. అయితే రజనీ రాజకీయ ప్రవేశం వెనుక బీజేపీ హస్తం ఉందని కొందరు ప్రచారం చేస్తుండటంతో తామరపువ్వును తొలగించి బాబా ముద్ర చుట్టూ ఒక పామును చేర్చిన బొమ్మ తాజాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే పార్టీ పేరును, చిహ్నాన్ని ఎప్పుడు ప్రకటిస్తారన్నది మాత్రం ఇంకా తెలీదు.

 

ఇప్పుడు ఇంకో అంశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. అసలు రజనీ ఆ సింబల్ ను ఎందుకు ఎంచుకున్నారు.. దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటీ అని. అయితే ఈ చర్చల్లో కొన్ని ఆసక్తికర విషయాలే బయటపడ్డాయి. మధ్య వేలు, ఉంగరం వేలు ని మడిచి బొటన వేలు కింద నొక్కి ఉంచి, చూపుడు వేలు , చిటికెన వేలు పైకి లేపి ఉంచడమే ఆపాన ముద్ర. ఈ ముద్ర మనిషిలోని కల్మషాన్ని భౌతికంగా, శారీరకంగా తొలిగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పిత్త,అగ్ని సంబంధం అయిన అనారోగ్యం దరి చేరకుండా ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుందట. శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపించడంతో పాటు గ్యాస్ , కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, పైల్స్, గుండె పోటు నుంచి మనిషిని రక్షించడానికి ఈ ముద్ర ఎంతగానో సాయపడుతుందట. ఉదరం లో మొదలై గుండె దాకా వెళ్లే ఆరోగ్య సమస్యలపై ఈ ముద్ర తిరుగులేని అస్త్రమట. ఒకప్పుడు ఈ తరహా సమస్యలు ఎదుర్కొన్న రజని వాటి నుంచి బయటపడేందుకు ఈ ముద్ర ఎంతో ఉపయోగపడిందట. అందుకే సమయం తప్ప ఏ ఖర్చు లేని ఈ ముద్రకి ప్రచారం కల్పించే ఉద్దేశంతోటే దాన్ని పార్టీ సింబల్ గా ఎంచుకోవచ్చని తెలుస్తోంది. దీంతో రజనీ ముద్ర వెనుక ఇన్ని సీక్రెట్స్ ఉన్నాయా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.