గోషామహల్‌కు ఉప ఎన్నిక రాదంటున్న రాజాసింగ్

Publish Date:Jul 29, 2025

Advertisement

గోషామహల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికపై స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచారం చేయాలని బీజేపీ అభ్యర్థి కోరితే తాను ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. గోషా మహల్ అసెంబ్లీ స్థానానికి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రాదని స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుందంటూ కొంత మంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ లేని పోని గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.  ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ పెద్దలు తనను పిలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తన బాధలు వారికి చెప్పిన తర్వాత తాను బీజేపీలో తిరిగి చేరే అంశంపై క్లారిటీ ఇస్తానన్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ అభ్యర్థి వ్యక్తిగతంగా పిలిస్తే.. వెళ్లి ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. 
బీజేపీ రాష్ట్ర నాయకత్వం తనను గుర్తించకపోయినా.. తనను గుర్తించే వాళ్లు చాలా మంది ఉన్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. బీజేపీలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు. వారంతా బయటకు వచ్చి మాట్లాడటానికి భయపడుతున్నారన్నారు. తాను వెళ్లి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే అక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ చాలా బాగా పెరిగిందని వివరించారు. తనపై ఎవరు ఎన్ని కుట్రలు చేసారో అన్ని తనకు తెలుసునని చెప్పారు.

కేంద్ర మంత్రులు తనతో టచ్‌లోనే ఉన్నారన్న రాజాసింగ్.. తాను శివసేన, టీడీపీ, జనసేనలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను నిర్ద్వంద్వంగా ఖండించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఇవన్నీ బీజేపీ మిత్రపక్ష పార్టీలేనని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షడు రామచందర్ రావు బాగానే పని చేస్తున్నారంటూ   ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నేతృత్వంలో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఇటీవల ఎన్నిక జరిగింది. ఈ పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు ఢిల్లీలోని పార్టీ అగ్రనాయకత్వం ఆశీస్సులున్నాయి. అయితే అదే సమయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఈ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు అనుచరగణంతో కలిసి పార్టీ కార్యాలయానికి తరలి వెళ్లారు. అయితే ఆయన్ని పార్టీ కార్యాలయం లోపలికి వెళ్లకుండా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై  అక్కడికక్కడే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీకి, నాయకులకు ఒక దణ్ణం అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు.  రాజీనామా లేఖను పార్టీ అగ్రనాయకులకు పంపారు. వారు వెంటనే దానిని ఆమోదించారు. దీంతో గోషామహల్ ఎమ్మెల్యే మరో పార్టీలో చేరతారంటూ ప్రచారం జోరందుకుంది. అది సోషల్ మీడియాలో  ఓ రేంజ్ లో వైరల్ అయింది.  మరోవైపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో జూబ్లీహిల్స్‌తోపాటు గోషా మహల్ అసెంబ్లీ స్థానాలకు ఒకే సారి ఉప ఎన్నిక వస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. మరో వైపు బీజేపీని విడిచి పెట్టవద్దంటూ ఢిల్లీలోని కొంత మంది ఆ పార్టీ నేతలు.. రాజాసింగ్‌కు సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వారు పార్టీ అగ్రనాయకత్వంతో మధ్యవర్తిత్వం నెరుపుతున్నట్లు సమాచారం. 

ఈ నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో ఎమ్మెల్యే రాజా సింగ్‌కు ఢిల్లీలోని బీజేపీ పెద్దల నుంచి పిలుపు వస్తుందని.. వారితో భేటీ తర్వాత మళ్లీ బీజేపీలో చేరే అంశంపై క్లారిటీ ఇస్తారనే ఓ చర్చ అయితే గోషామహల్‌లో సాగుతోంది. అదీకాక.. గత కొంత కాలంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి, ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ఒక ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. 

By
en-us Political News

  
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.