ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం.. లోకేష్ ఫైర్

Publish Date:Aug 31, 2022

Advertisement

రెండు రెళ్లు నాలుగు అన్నందుకు గూండాలు గుండ్రాలు విసిరే సంస్కృతి ప్రస్తుతం ఏపీలో ఉంది. ఒక ఫ్యాక్షనిస్టు, పిరికి వాడు ప్రభుత్వాధినేతగా ఉంటే ఆ రాష్ట్రం ఎంత అధ్వానంగా ఉంటుందో చెప్పడానికి ఏపీ నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. విమర్శ అంటే భయం, ప్రజలంటే భయం..దాన్ని కప్పి పుచ్చుకోవడానికి పోలీసుల అండతో అక్రమ కేసులు, అరెస్టులు, వైసీపీ గూండాలతో దాడులు.. ఇదీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి.

ఈ మాటలు అన్నది ఎవరో కాదు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కుప్పంలో అన్న క్యాంటిన్ ను రెండో సారి కూల్చేసిన తరువాత ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్తూరు పర్యటనలో ఆయన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ లో అంబేడ్కర్ రాజ్యాంగం కాదు ఫ్యాక్షనిస్టు రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రజాస్వామ్యంపై ఇసుమంతైనా గౌవరం లేని ఒక ఫ్యాక్షనిస్టు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారని దుయ్యబట్టారు. ఒక ఫ్యాక్షనిస్టు సీఎం అయితే రాష్ట్రం ఎంత అధోగతి పాలౌతుందో అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని లోకేష్ అన్నారు. అయిన దానికీ కాని దానికీ అక్రమ కేసులు బనాయిస్తున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 60 మందికి పైగా తెలుగుదేశం కీలక నేతలపై కేసులు పెట్టారనీ, ఐదు వేల మందికి పైగా తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధించారనీ లోకేష్ అన్నారు.  ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి తెలుగుదేశం డీఎన్ఎలో భయం అన్న పదానికి తావేలేదని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఐపీసీ(ఇండియన్ పీలన్ కోడ్)ని ఫాలో కావడం లేదనీ, జేపీసీ(జగన్ పీనల్ కోడ్)ని ఫాలో అవుతున్నారనీ లోకేష్ అన్నారు. రాష్ట్రంలో కొందరు పోలీసులకు తెలుగుదేశం నేతల ముందు మీసం మెలేసి, తొడ కొట్టడం, తెలుగుదేశం నాయకులపై దాడులు చేయడం ఫ్యాషన్ గా మారిందని విమర్శించారు.

చట్టాన్ని ఉల్లంఘించే వారెవరైనా సరే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సొంత చెల్లి, తల్లికివ అన్నంపెట్టకుండా బయటకు గెంటేసిన దుర్మార్గుడు జగన్ పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటిన్ లను కూడా కూల్చేస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హయాంలో నడుస్తున్న అన్న క్యాంటిన్లను రద్దు చేశారు, ఇప్పుడు తెలుగుదేశం నిర్వహిస్తున్న క్యాంటిన్లను కూల్చివేస్తున్నారు అని విమర్శించారు. మంగళగిరి లో తాను అన్న క్యాంటీన్ పెడితే ధ్వంసం చేసారు. కుప్పం లో అన్న క్యాంటీన్ పై దాడి చేసారని లోకేష్ విమర్శించారు. ప్రశాంతంగా ఉండే కుప్పం పులివెందుల పరిస్థితులు తీసుకువచ్చారన్నారు.

జడ్ ప్లస్ క్యాటగిరి భద్రత ఉన్న చంద్రబాబు కుప్పం పర్యటనకు వస్తే కనీస భద్రతా ఏర్పాట్లు చేయలేదన్నారు. కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలకు బాధ్యులు వైసీపీ గూండాలైతే.. అమ్ముడుపోయిన పోలీసులు  టీడీపీ నాయకులపై కేసులు పెట్టారని, అరెస్టులు చేశారని విమర్శించారు.  వైసిపి గూండాల దాడి ని అడ్డుకుంటే హత్యాయత్నం కేసులా? అన్నారు.  పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని వాడు…ఇక్కడికి వచ్చి కుప్పంను అభివృద్ది చేస్తాడా? అని లోకేష్ ఎద్దేవా చేశారు.   గడప గడప కి వెళ్లలేని వైసిపి నాయకులు కుప్పంలో గొప్పలు చెప్పడం హస్యాస్పదంగా ఉందని లోకేష్ అన్నారు.

By
en-us Political News

  
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.