మొరగని కుక్క లేదు.. అర్థమైందా రాజా?.. వైసీపీ నేతలకు రజినీకాంత్ చురకలు!

Publish Date:Aug 8, 2023

Advertisement

దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న అతి కొద్దిమంది హీరోలలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. అయినప్పటికీ ఆయనలో ఆ అహం ఉండదు. అందరితో మంచిగా ఉంటారు. సాధారణ జీవితాన్ని గడుపుతూ, వివాదాలకు దూరంగా ఉంటూ తన పనేదో తాను చూసుకుంటూ ఉంటారు. అలాంటి రజినీకాంత్ కి కోపం వచ్చింది. "కుక్కలు మొరుగుతుంటాయి.. మన పని మనం చేసుకుంటూ పోవాలి" అంటూ పరోక్షంగా కొందరికి చురకలు అంటించారు. అయితే రజినీకాంత్ కోపానికి కారణం.. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేతలు అని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

 రజినీకాంత్ కి తెలుగులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో మంచి అనుబంధం ఉంది. చంద్రబాబు నాయుడుతో, నందమూరి కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఆ అనుబంధంతోనే ఈ ఏడాది ఏప్రిల్ 28 న విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే చంద్రబాబు గొప్పతనాన్ని వివరించారు. హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలిపిన ఘనత చంద్రబాబుది అని, ఆయన గొప్ప విజనరీ ఉన్న నాయకుడని, ఆయన హయాంలో రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందని కొనియాడారు. ఈ మాటలు ఏపీ అధికార పార్టీ నేతలకు నచ్చలేదు. నిజానికి ఆ వేడుకలో రజినీకాంత్ ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. తన స్నేహితుడు చంద్రబాబు ఎంత గొప్ప నాయకుడో చెప్పే ప్రయత్నం చేశారు అంతే. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం రజినీకాంత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచస్థాయి గుర్తింపు ఉన్న హీరోని పట్టుకొని నువ్వు హీరోవా అంటూ చులకన చేశారు. కొడాలి నాని మొదలుకొని పోసాని కృష్ణమురళి వరకు ఎందరో రజినీకాంత్ పై విమర్శలు గుప్పించారు. రజినీకాంత్ పై అలా విమర్శలు చేయడాన్ని మేధావులు, స్వతంత్రులు సైతం తప్పుబట్టారు. అయితే ఇంత కాలం ఈ విషయంపై సైలెంట్ గా ఉన్న రజినీకాంత్.. తాజాగా గట్టి కౌంటర్ ఇచ్చారు.

 రజినీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. ఈ సినిమా వేడుకలో ఆయన మాట్లాడుతూ.. "మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా?" అంటూ చురకలు అంటించారు. మొదటి వాక్యాలను తమిళ్ లో చెప్పిన రజినీకాంత్.. చివరిలో మాత్రం 'అర్థమైందా రాజా' అని తెలుగులో చెప్పడం విశేషం. పోసాని మాట్లాడితే 'రాజా రాజా' అంటుంటారు. అందుకే పోసాని శైలిలోనే అర్థమైందా రాజా అంటూ వైసీపీ నాయకులకు రజినీ చురకలు అంటించారనే చర్చ జోరుగా నడుస్తోంది.

రీసెంట్ గా చిరంజీవి సైతం సినిమా వాళ్ళపై మీ ప్రతాపం చూపించడం మానేసి, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటిస్తూనే హితవు పలికారు. దీంతో మొన్నటిదాకా చిరంజీవిని పొగిడిన అధికార పార్టీ నేతలే.. ఇప్పుడు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ వైపు విపక్షాలు అందరినీ కలుపుకొని పోతూ రోజురోజుకీ బలపడుతుంటే.. ఇప్పటికే రాజధాని పరంగా, అభివృద్ధి పరంగా విమర్శలు ఎదుర్కొంటున్న అధికార పార్టీ మాత్రం.. తన గోతిని తానే తవ్వుకున్నుట్లుగా ఆ నాయకుల నోటి తీరుతో అందరికీ దూరమవుతూ.. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తన గ్రాఫ్ ని మరింత పడిపోయేలా చేసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.