రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పీక్స్ కు.. బీజేపీ ప్రకటన

Publish Date:Jul 1, 2025

Advertisement

రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పీక్స్ కు చేరిందని బీజేపీ ఓ ప్రకటనలో పేర్కొంది. పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సత్యదూరమని ఆ ప్రకటనలో పేర్కొంది. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానంటూ బీజేపీ కార్యాలయానికి వచ్చిన రాజాసింగ్ ను ఎవరూ అడ్డుకోలేదని స్పష్టం చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ అభయ్ పాటిల్ రాజాసింగ్ తో చర్చించి ఆయన కోరిక మేరకు రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి నామినేషన్ పత్రాలు ఇచ్చారనీ, అయితే పది మంది రాష్ట్ర కౌన్సిలర్ల మద్దతు ఉంటేనే నామినేషన్ సమర్పించేందుకు వీలవుతుందనీ పేర్కొన్న బీజేపీ.. అంత మంది మద్దతు లేకపోవడం వల్లే నామినేషన్ వేయకుండా రాజాసింగ్ చేతులెత్తేశారని పేర్కొంది. ఆ విషయాన్ని దాచి పెట్టి, పార్టీ పోటీ చేయనివ్వడం లేదు.. బెదిరిస్తున్నారంటూ మీడియా ముందు అవాస్తవాలు చెప్పారని బీజేపీ ఆ ప్రకటనలో విమర్శించింది.  రాజాసింగ్ రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడికి పంపిస్తారని తెలిపింది.  

నిజంగానే రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయదలచుకుంటే.. స్పీకర్ కే రాజీనామా పత్రాన్ని సమర్పించాలని పేర్కొంది. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదని స్పష్టం చేసింది. గతంలో కూడా పలుమార్లు క్రమశిక్షణను రాజాసింగ్ ఉల్లంఘించారనీ, ఒక సారి సస్పెండ్ కూడా  అయ్యారనీ తెలిపిన బీజేపీ    వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని తేల్చి చెప్పింది.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా మోజు ఎంతలా పెరిగిపోయిందంటే.. కొందరు కనీస మానవీయ విలువలను, కన్నబిడ్డల భద్రతను కూడా విస్మరిస్తున్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.