నాదర్‌గుల్‌ దాండియా వేడుకలో విషాదం.. ముగ్గురు అరెస్ట్‌.!

Publish Date:Oct 20, 2026

Advertisement

హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్న సమయంలో లైటింగ్‌ పోల్‌ కూలిపడటంతో సోనీ నారాయణ దాస్‌ అనే విద్యార్థిని మృతి చెందగా, మరో 22 మంది విద్యార్థులు గాయపడిన ఘటన అందరికీ తెలిసిందే... అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. ఈ మేరకు శంషాబాద్‌లోని డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శంషాబాద్‌ జోన్‌ డీసీపీ రాజేష్‌ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన దాండియా వేడుకల్లో లైటింగ్‌ పోల్‌కు సరైన సపోర్టు ఏర్పాటు చేయకపోవడమే కారణమని పోలీసులు ప్రాథమికంగా  గుర్తించారు. విద్యార్థిని మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి, ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఈవెంట్‌ నిర్వహణకు సంబంధించిన క్రియా ఈవెంట్‌ ఆర్గనైజర్‌, వయూరా ఎక్స్‌పీరియన్స్‌, పీఎస్‌ లైటింగ్‌ అండ్‌ సౌండ్స్‌కు చెందిన నిర్వాహకుల పాత్రపై విచారణ చేపట్టాము. ఈ క్రమంలో మల్లెల సాకేత్‌, బత్తుల పునీత్‌, సాయం విశాంత్‌లను అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఏడుగురిని నిందితులుగా గుర్తించినట్లు డిసిపి వెల్లడించారు. 

ఈవెంట్‌ నిర్వాహకులకు చెందిన ధనుష్‌, మహేష్‌ పరారీలో ఉన్నట్లు డిసిపి తెలిపారు. కళాశాల తరఫున కోఆర్డినేటర్లుగా వ్యవహరించిన అఖిల్‌, కారే రాజేష్‌, హనుమంతరావు పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చినట్లు డీసీపీ తెలిపారు. అయితే పరారీలో ఉన్నవారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు డిసిపి వెల్లడించారు. దాండియా వేడుకల కోసం ఏర్పాటు చేసిన లైటింగ్‌ పోల్‌కు తగిన భద్రతా ఏర్పాట్లు, సరైన సపోర్టు లేకపోవడం వల్లే అది కూలిపోయినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు డీసీపీ రాజేష్‌ తెలిపారు. విద్యార్థులు వేడుకల్లో పాల్గొంటున్న సమయంలో పోల్‌ కూలిపోవడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ ప్రమాదంలో సోనీ నారాయణ దాస్‌ ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను యశోద, కామినేని, ప్రత్యూష ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించినట్లు డిసిపి తెలిపారు. ఘటనకు సంబంధించి ఎంవీఎస్ఆర్‌ కళాశాల యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశామన్నారు.కళాశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ ప్రమాదంపై ఆదిభట్ల పోలీసులు  నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్లు 105, 125(ఏ) కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కళాశాలల్లో నిర్వహించే వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో భద్రతా ప్రమాణాలు పాటించేలా త్వరలోనే ఆయా కళాశాలల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు డీసీపీ రాజేష్‌ తెలిపారు.

 

 

 

[ MVSR Engineering College, Nadergul Dandiya Accident, Hyderabad Dandiya Tragedy, Three Arrested, Sony Narayana Das, Shamshabad DCP Rajesh, Lighting Pole Collapse, Dandiya Event Accident, Student Death, College Management Case, Student Safety, Hyderabad Crime News, Telangana Police Investigation ]


 

By
en-us Political News

  
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
వందేళ్లు దాటినా తగ్గని ఉత్సాహం.. 101 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యాలు ఇవే.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.