భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, రైతుల జీవనాధారమైన వ్యవసాయ రంగానికి వెన్నుముక లాంటి నైరుతి రుతుపవనాలు ఈ సారి దెబ్బకొట్టనున్నాయి. ఎల్ నినో ప్రభావంతో దేశంలో ఈ ఏడాది 90 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎమ్డి పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపనుందన్న ఐఎండీ చేసింది. 2026 సంవత్సరానికి సంబంధించిన రుతుపవనాల అంచనాలను సవరించింది. ఈ ఏడాది దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 90 శాతం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అంటే సాధారణం కంటే చాలా తక్కువగా వర్షాలు కురుస్తాయి. దశాబ్ద కాలంలోనే దేశంలోనే అత్యంత బలహీనమైన వర్ష సూచన ఇదే అవుతుందన్న మాట.
సాధారణంగా జూన్ మొదటి తేదీకే దేశాన్ని పలకరించాల్సిన నైరుతి రుతుపవనాలు ఈ సారి , ఈసారి జూన్ 4న అంటే నాలుగు రోజులు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకాయి. దేశవ్యాప్తంగా దాదాపు 70 శాతానికి పైగా వర్షపాతాన్ని అందిస్తూ.. దేశ ఆహార భద్రతను శాసించే రైరుతి రుతుపవన వ్యవస్థ ప్రారంభంలోనే ఇలా బలహీనపడింది.
పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్నే ఎల్ నినో అంటాము. ఎల్ నినో వాతావరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. రుతుపవనాల విస్తరణకు అత్యంత కీలకం సముద్రంలో తుపానులు ఏర్పడడానికి అనువైన వాతావరణం ఏర్పడటం. అయితే ఎల్ నినో ప్రభావంతో తుపానులు ఏర్పడడానికి అనుకూలంగా వాతావరణం ఉండటం అటుంచి యాంటీ తుపాన్ పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా భారత ఉపఖండం వైపు వచ్చే రుతుపవన గాలుల వేగం, తీవ్రత పూర్తిగా తగ్గిపోతాయి. ఈ జూన్ నుండి ఆగస్టు 2026 మధ్య కాలంలో ఎల్ నినో ఏర్పడే అవకాశం 80 శాతం వరకు ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. నవంబర్ నాటికి ఈ ముప్పు ఏకంగా 90 శాతానికి పెరుగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది.
ఐఎండీ అంచనాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దక్షిణ భారత్‌లో వర్షాలు బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. కేవలం వాయవ్య ప్రాంతాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశంఉంది. ముఖ్యంగా జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం అత్యల్పం అని ఐఎండీ పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rainfall-less-than-90-percent-36-222024.html
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్‌గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్‌గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.