అమ్మ ఇంటికే రాహుల్.. ఇక అక్కడే మకాం

Publish Date:Apr 15, 2023

Advertisement

కాంగ్రెస్  మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ,  తుగ్లక్ లేన్‌-12లోని తన అధికార నివాసం ఖాళీ చేసి,  తల్లి సోనియా గాంధీ అధికార నివాసం 10 జనపథ్ కు మకాం మార్చేస్తున్నారు. 2004లో రాహుల్ గాంధీ తొలిసారిగా, అమేథీ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఎంపీగా ఆయనకు ప్రభుత్వం కేటాయించిన తుగ్లక్ లేన్‌-12బంగ్లాలోనే ఉంటున్నారు.

అయితే ఇటీవల, ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దయిన నేపధ్యంలో, ఆయన అధికార నివాసం ఖాళీ చేయక తప్పని పరిస్థితి తలెత్తింది. దీంతో రాహుల్ గాంధీ తన సామాన్లను 10 జనపథ్’కు షిఫ్ట్ చేశారు. ఇహనో ఇప్పుుడో  ఆయన కూడా షిఫ్ట్ అవుతారు. ఇక నుంచి ఆయన తన తల్లి వద్దే ఉంటారు.  మరోవంక రాహుల్ గాంధీ 2019లో ఎన్నికల ర్యాలీలో చేసిన దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది  అన్నందుకు ఆయన్ని దోషిగా నిర్ధారిస్తూ మార్చి 23న సూరత్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

ఈ నేపథ్యంలో అమలులో ఉన్న  నిబంధనల ప్రకారం  పార్లమెంటు సెక్రటెరియట్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది. మరో వంక ఈ తీర్పుపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేశారు. అయితే,   కేసును విచారించిన న్యాయస్థానం తుది తీర్పును ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.  

మరోవంక  రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దయిన నేపధ్యంలో ఏప్రిల్ 22లోగా అధికార నివాసాన్ని  ఖాళీ చేయాలని లోక్‌సభ సెక్రటేరియట్   ఆయనకు మార్చి 27న నోటీసులు పంపింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ అధికార నివాసాన్ని ఖాళీ చేసి సోనియా నివాసానికి మారారు.

అయితే రాహుల్ గాంధీకి ఇప్పడు  ఖాళీ చేస్తున్న బంగ్లాతో సుదీర్ఘ అనుబంధం వుంది.   2004 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ తొలిసారిగా అమెథీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వరసగా మరో రెండు మార్లు అదే నియోజక వర్గం నుంచి గెలిచారు.  2019 ఎన్నికల్లో మాత్రం, అమేధీతో పాటుగా కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానం నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ గాంధీ అమేధీలో ఓడి పోయినా, వాయనాడ్ లో గెలిచి వరసగా నాల్గవ పర్యాయం  (ఎంపీగా  అనర్హత వేటు పడేంత వరకు) ఎంపీ కొనసారు.  

అంటే ఇంచుమించుగా 18 సంవత్సరాలకు పైగా రాహుల్ అదే తుహ్లాక్ లైన్ 12 బంగ్లాలో ఉంటున్నారు. ఆయన ఆ బంగ్లాతో  తనకున్న అనుబంధాన్ని, అనుభూతులను పంచుకున్నారు. మరోవంక రాహుల్ గాంధీ తమ నివాసాన్ని ఖాళీ చేయవలసివస్తే, తమ నివాసంలో ఉండవచ్చని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆఫర్ ఇచ్చారు. అయితే రాహుల్, అమ్మతో ఉండేందుకే నిర్ణయించుకున్నారు.

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.