పాదయాత్రలో రాహుల్ పరుగో..పరుగు...!

Publish Date:Nov 1, 2022

Advertisement

ఎంతో వేగంగా పరిగెట్టడం ఆ పోటీల్లో గెలవడం అనుకున్నంత సులభం కాదు.  మన  స్ప్రింటర్లలో అమియా కుమార్, గురువీందర్ సింగ్  జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు వాళ్లు కూడా అమితాశ్చర్యంతో ఓర్నీ ఈయనున్న పోటీలో పాల్గొనలేదే అనుకుంటున్నారేమో.  జాతీయ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కుమారుడు, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఊహించని విధంగా స్ప్రింటర్ రూపం ఎత్తారు. దేశంలో చాలాభాగం మొన్నటి దాకా భారత్ జోడో యాత్ర చేసి అందులో భాగంగానే తెలంగాణా గొల్లపల్లి  వచ్చిన రాహుల్ గాంధీ అందర్నీ పలకరిస్తూ హఠాత్తుగా పరుగుపోటీకి సిద్ధ మ య్యారు. చిత్రమేమంటే తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఓడిపోయారు. 

దేశంలో జాతీయ క్రీడల్లో అమ్లా బోర్గాన్, అమియా మాలిక్, ధ్యుతీ చంద్ వంటివారి వేగాన్ని చూసినవారు, రాజకీయ నాయకుల్లో యువ కిశోరంలా  మంగళవారం  రాహుల్ గాంధీ అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. భారత్ జోడో యాత్ర  గొల్లపల్లికి చేరుకుంది. రాహుల్ గాంధీ కి అందరూ ఘన స్వాగతం పలికారు. అంద ర్నీ అమితోత్సా హంతో పలకరిస్తూ, అస్సలు అలసటే కనపడకుండా నడుస్తూ అందర్నీ తన వెంట పరుగులాంటి నడక నడిచేలా చేస్తుంటే యువకులు, నాయకులు ఆశ్చర్యంలో అలా ఆయన్నే చూస్తుండిపోయారు. 

హఠాత్తుగా పాదయాత్ర కాస్తా పరుగు పోటీగా మారిపోయింది. అయితే ఇందులో రాహుల్ తో రేవంత్ మాత్రమే పోటీ పడ్డారు. అలా రూల్ పెట్టుకున్నారేమో అనిపించింది.  పాదయాత్ర లో రాహుల్ ని కలివడానికి పిల్లలు రావడంతో ఆయన మరింత కుర్రాడయిపోయి పరుగు తీయడం మొదలయిది.. అంతే రేవంత్ కి ఆయనతో పోటీపడాల్సి వచ్చింది. కానీ రేవంత్ వల్ల కాలేదు. చిత్రమేమంటే ఇప్పటికే చాలా దూరం భారత్ జోడో యాత్ర చేస్తూన్నప్పటికీ కుర్రాడిలానే ద్విగుణీకృత ఉత్సాహంతో రాహుల్ పరుగులు తీయడం. పోలీసులు, రేవంత్, కుర్రాళ్లూ , పిల్లలూ అంతా వెనకబడిపోయారు.  ఈ పోటీలో తాము లేకపోయామని మాజీ స్స్రింటర్లు అనుకునే ఉంటారు.

పార్టీ నాయకత్వం బాధ్యతను తాను స్వీకరించలేదు కానీ ప్రజలను పార్టీ వేపు తిప్పేందుకు, ఈ తరం వారిని పార్టీలోకి ఆకట్టుకోవడానికి, కేంద్రంతో పోరుకీ రాహుల్ గాంధీలో ఆవేశం, ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదన్నది  ఈ పరుగు స్పష్టం చేసింది.  అయితే రాహుల్ తన బాస్ కనుక ఆయన్ను గెలిపించడం ధర్మమనే భక్తి భావంతో రేవంత్ కావాలనే వెనుకడుగు వేశారని సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రాహుల్ పరుగు పందెం వీడియో చూసిన, చూస్తున్నవారంతా అసలు పార్టీ పదవిని ఈయనే తీసుకోవాల్సింది అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఖర్గే కంటే పార్టీలోకి యువతను రాహుల్ రాబట్టగలడన్న అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. అయితే పార్టీ నాయకత్వం గాంధీ కుటుంబేతరులకు యివ్వాలన్న నిర్ణయం తప్పని పరిస్థితుల్లో తీసుకోవడం వల్ల ఖర్గే కు పార్టీ పగ్గాలు అందాయి. కానీ ఇటు భారత్ జోడో యాత్ర చేపడుతూ రాహుల్ గాంధీ తక్కువేమీ తినడం లేదు. రోజు రోజుకూ యువకునిగా మారుతూ, మాటల్లో, ప్రసంగాల్లో, యువతను ఆకట్టుకోవడంలో తన శైలితో మరింత ముందుకు వెళుతున్నారు. ఆయన్ను గతంలో చూసినవారు, గమనించినవారు ఆయనలో వచ్చిన మార్పు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.