రాహుల్ సారీ ఇదిఎన్నోసారి ..

Publish Date:Jun 14, 2022

Advertisement

కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ రాహుల గాంధీ మరో  మారు, క్షమాపణ చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కుంటున్నకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు, ఈడీ అధికారులకు క్షమాపణ చెప్పారు. నిన్న (సోమవారం) ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాల్లో తప్పులు దొర్లిన నేపథ్యంలో అధికారులకు క్షమాపణలు చెప్పారని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈరోజు (మంగళవారం) వాంగ్మూలం నమోదు చేసే సమయంలో జాగ్రత్తగా ఉంటానని రాహుల్ చెప్పినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.

అదలా ఉంటే, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పడం ఇదే మొదటి సారి కాదని, గతంలో ఆయన, అనేక సందర్భాలలో వివాదాస్పద, అసత్య వ్యాఖ్యలు చేసి, న్యాయస్థానాలకే కాదు, పార్లమెంట్’కు కూడా క్షమాపణలు చెప్పారని రాజీయ పరిశీలకు గుర్తు చేస్తున్నారు. మాట తడబడి పార్లమెంట్ ‘కి సైతం క్షమాపణలు చెప్పారని పరిశీలకు గుర్తు చేస్తున్నారు.మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం,పేరును స్పష్టంగా పలక లేక, తడబడి నవ్వుల పాలైన సందర్భంలో, రాహుల గాంధీ పార్లమెంట్’లో  జోవియల్ గానే కావచ్చును, సారీ.. సారీ ... సారీ అంటూ సభలో నవ్వులు పూయించారు. 
అదలా ఉంటే, 2014 ఎన్నికల ప్రచార సభల్లో  మహాత్మా గాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయం  సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కుట్ర చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ ఆరోపణల ఆధారంగా ఆర్ఎస్ఎస్ భివాండి (మహారాష్ట్ర) కోర్టులో పరువు నష్టం దావా వేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్ గాంధీ, ఆరోపణలు అవాస్తమని నిర్ధారించడంతో రాహుల్  గాంధీ ఆర్ఎస్ఎస్’కు, న్యాయస్థానానికి  క్షమాపణలు చెప్పారు.  
ఇక రఫేల్‌ కేసుకు సంబంధించి 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ, ‘చౌకీదార్‌ చోర్‌ హై' అనే స్లోగన్ కాయిన్ చేశారు. ప్రధాని మోడీని ‘దొంగ’ గా అభివర్ణిస్తూ ప్రచారం సాగించారు. అంతే కాకుండా, ఇందుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానమే, ప్రధానిని తప్పు పట్టిందని తప్పుడు ప్రచారం చేశారని న్యాయస్థానం తప్పు పట్టింది. ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. అమేథి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ఉద్దేశించి చౌకీ దార్ చోర్ హై’ అని  సుప్రీంకోర్టు చెప్పిందంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు రాహుల్ గాంధీని తీవ్రంగా మందలించింది. ఆయన  వివరణ ఇచ్చారు. క్షమాపణ చెప్పారు. అది కూడా ఒకసారి కాదు, రెండు సార్లు.  వివరాల్లోకి వెళితే, చౌకీదార్‌ చోర్‌ హై అని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎంపి మీనాక్షి లేఖి కోర్టు ధిక్కార కేసు పెట్టారు. ఈ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు రాహుల్‌ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. చౌకీదార్‌ వ్యాఖ్యలపై కోర్టును తప్పుదోవ పట్టించడం సబబు కాదని రాహుల్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్‌ ఇప్పటివరకు క్షమాపణ ఎందుకు చెప్పలేదని, చింతించడం అనే పదం కోసం 22 పేజిల అఫిడవిట్‌ ఏంటని సుప్రీం ఆగ్రహించింది. రాహుల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి క్షమాపణలు చెప్పారు. కోర్టును కించపరచే ఉద్దేశం లేదని, క్షమాపణ చెబుతూ అఫిడవిట్‌ దాఖలు చేస్తానని రాహుల్‌ సుప్రీంకు వివరణ ఇచ్చారు.

ఇక ప్రస్తుతానికి వస్తే,నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కుంటున్నకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు, ఈడీ అధికారులకు క్షమాపణ చెప్పారు. ఈడీ విచారణలో భాగంగా రాహుల్ గాంధీ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాల్లో తప్పులు దొర్లిన నేపథ్యంలో అధికారులకు క్షమాపణలు చెప్పారని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈరోజు (మంగళవారం) వాంగ్మూలం నమోదు చేసే సమయంలో జాగ్రత్తగా ఉంటానని రాహుల్ చెప్పినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.అదలా ఉంటే, నేషనల్ హెరాల్డ్ కేసులో రెండో రోజు విచారణకు ఎదుర్కుంటున్న రాహుల గాంధీకి కాంగ్రెస్ కార్యకర్తలు, పలువురు నేతలు సంఘీభావం తెలిపారు.

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.