ఎమ్మెల్యేపై మూడో రేప్ కేసు...అరెస్ట్ చేసిన పోలీసులు
Publish Date:Jan 11, 2026
Advertisement
కేరళ కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటతిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా మూడో కేసు నమోదవడంతో ఆయను అదుపులోకి తీసుకున్నారు. పతనంతిట్ట జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పాలక్కాడ్‌లో ఆయన్ను పట్టుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్బవతిని చేసి మోసం చేశాడని సదరు మహిళ ఆరోపించారు. నమ్మించి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసినట్లు తెలిపింది. అబార్షన్ చేయించుకోమని బెదిరించాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నది. రాజకీయంగా అతడికి పలుకుబడి ఉండడంతో ఇన్ని రోజులు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని.. అయితే ఎమ్మెల్యేపై రేప్ కేసులు నమోదుకావడంతో తాను కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. వరుస లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అతడిని బహిష్కరించింది. సీఎంవో ఆఫీసుకు మెయిల్ ద్వారా రాహుల్ పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును సీఎంవో క్రైమ్ బ్రాంచ్ కు పంపగా.. విచారణ నిమిత్తం ఎమ్మెల్యేను అరెస్టు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణ తర్వాత తిరువల్ల కోర్టులో రాహుల్ ను ప్రవేశపెట్టి కస్టడీ కోరనున్నట్లు వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/rahul-mamkootathil-36-212364.html





