ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ గాంధీ సభకు లైన్ క్లియర్.!
Publish Date:Aug 7, 2026
Advertisement
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించ తలపెట్టిన ఛాత్రోన్ కీ గూంజ్ (విద్యార్థుల గళం) సదస్సుకు లైన్ క్లియర్ అయ్యింది. సభా వేదికకు సంబంధించి ఇచ్చిన అనుమతిని ఆ తరువాత అకస్మాత్తుగా ఉప సంహరించుకున్న కాయస్థ పాఠశాల ట్రస్ట్, దీనిపై సర్వత్రా నిరసనలు, విమర్శలు వెల్లువెత్తడంతో అనివార్యంగా వెనక్కు తగ్గి అనుమతిని పునరుద్ధరిస్తూ గురువారం (ఆగస్టు 6) రాత్రి పొద్దుపోయిన తరువాత ప్రకటన విడుదల చేసింది. అయితే కొన్ని షరతులు విధించింది. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. ఇందుకు కేపీ ట్రస్ట్ అనుమతి కూడా ఇచ్చింది. అయితే.. అనూహ్యంగా.. కేపీ ట్రస్ట్ బుధవారం ( ఆగస్టు 5) సభకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించరుకుంటున్నట్లు తెలిపింది. రాహుల్ గాంధీ నేరుగా విద్యార్థుల సమస్యలపై గళమెత్తితే ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయన్న భయంతోనే కేంద్రంలోని మోడీ సర్కార్, యూపీలోని బీజేపీ ప్రభుత్వం.. ట్రస్ట్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి సభకు అనుమతి రద్దు చేయించాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వేదిక అనుమతి రద్దయినా.. మైదానాలు మారినా రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్ పర్యటన రద్దు కాదనీ, నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందనీ కాంగ్రెస్ ప్రకటించింది. రాహుల్ సభకు అనుమతి రద్దు చేస్తూ కేపీ ట్రస్ నిర్ణయం పట్ల సర్వత్రా ఆగ్రహం, విమర్శలు రావడంతో.. ఆ ట్రస్ట్ తాత్కాలిక అధ్యక్షుడు జితేంద్ర నాథ్ చౌదరి హైకోర్టు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి.. సభకు అనుమతిని పునరుద్ధరించారు. అయితే.. ఈ సభ వల్ల కాలేజీలో జరిగే తరగతులకు ఎలాంటి ఆటంకం, భంగం కలగకూడదనీ, ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ నుంచి కాంగ్రెస్ నాయకత్వం తప్పనిసరిగా చట్టబద్ధమైన అనుమతి తీసుకోవాలని షరతులు విధించారు. Rahul Gandhi Prayagraj Meeting, Chatron Ki Goonj, KP Ground Permission, Congress Student Rally, UP Politics News, Rahul Gandhi Student Interaction
http://www.teluguone.com/news/content/rahul-gandhi-prayagraj-meeting-25-228258.html





