రాహుల్ చచ్చు తెలివి!

Publish Date:Nov 9, 2013

Advertisement

 

 

 

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న విషయం హండ్రెడ్ పర్సెంట్ కన్‌ఫమ్ అయిపోయింది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ నెత్తిన తెల్లగుడ్డేనన్న విషయం అర్థమైపోయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు చాలా బలంగా వీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాను ప్రధాని కాలేమోనన్న భయం రాహుల్ గాంధీని పట్టి పీడిస్తోంది. ఆ భయంతోనే తానేం మాట్లాడుతున్నాడో తనకే అర్థంకాని స్థితిలో వున్నాడు. జనాన్ని బుట్టలో పెట్టడానికి మామూలు తెలివితేటలు పనికిరావని చచ్చు తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు.

 

చచ్చు తెలివితేటలంటే జనానికి చావుల పేరు చెప్పి సానుభూతి పొందాలని ప్రయత్నించడం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశలో వుంది. రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని మూడు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడు. మొన్నామధ్య జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, దేశం కోసం తన నాయనమ్మ, తన తండ్రి చనిపోయారని,  తనను కూడా తీవ్రవాదులు చంపే అవకాశం వుందని ప్రకటించిన రాహుల్ అందరి చేతా తలంటి పోయించుకున్నాడు. తన కుటుంబంలో జరిగిన మరణాలని, తనకున్న ప్రాణభయాన్ని సాకుగా చూపి ఓటర్ల నుంచి సానుభూతి పొందాలని రాహుల్ ప్రయత్నించడాన్ని ఎవరూ హర్షించలేదు. చావుల ప్రస్తావన తెస్తే ఒకసారి తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తినా రాహుల్ గాంధీలో మార్పు రాలేదు.



మరోసారి తన చచ్చు తెలివితేటలు ప్రదర్శించాడు. ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఆమధ్య జరిగిన మావోయిస్టుల దాడి సంఘటనని ప్రస్తావించాడు. ఛత్తీస్‌ఘడ్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, మావోయిస్టుల దాడిలో కేంద్ర మాజీ మంత్రి వి.సి.శుక్లా, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడితోపాటు చాలామంది కాంగ్రెస్ పార్టీవాళ్ళు చనిపోయారని అన్నాడు. ఇంతటి ప్రాణ త్యాగాల పార్టీ అయిన కాంగ్రెస్‌కే ఓటేయాలన్నాడు. మావోయిస్టుల దాడిలో జరిగిన మరణాలను ప్రస్తావించి ఓటర్ల నుంచి సానుభూతి పొందడానికి రాహుల్ ప్రయత్నించడం మరోసారి వివాదాస్పదం అయింది.

By
en-us Political News

  
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.