రాహల్ గాంధీ సహా ఐదుగురు ఎంపీలపై బీహార్ కోర్టులో పిటిషన్.. ఎందుకంటే?
Publish Date:Aug 7, 2026
Advertisement
పార్లమెంట్ ఆవరణలో స్కిట్ చేశారంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మరో నలుగురు విపక్ష ఎంపీలపై బీహార్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ ప్రాంగణంలో ప్రతిపక్ష నాయకులు ప్రదర్శించిన సొలిటిరల్ స్కిట్ తీవ్ర దుమారాన్ని రేపింది. సనాతన ధర్మ విశ్వాసాలను, భక్తుల మత మనోభావాలను గాయపరిచేలా ఈ ప్రదర్శన ఉందని, కేవలం ప్రచారం కోసమే ఇలా చేశారని ఆరోపిస్తూ.. న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. పార్లమెంట్ ఆవరణలో జులై 31న అయోధ్య రామమందిర విరాళాల కుంభకోణంపై విపక్ష ఎంపీలు వినూత్న నిరసన చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా ఇండిపెండేంట్ ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ఒక పూజారి వేషధారణలో కూర్చిన తన ముందు ఒక విరాళాల పెట్టెను ఉంచగా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు భక్తుల రూపంలో వచ్చి ఆ పెట్టెలో డబ్బులు వేస్తున్నట్లుగా.. ఆ డబ్బులను పూజారి వేషంలో ఉన్న పప్పు యాదవ్ తన జేబులో వేసుకోవడం, దాన్ని పక్కనే ఉన్న మరో ప్రతిపక్ష ఎంపీ ప్రశ్నించడం వంటి సన్నివేశాలను ఆ స్కిట్ లో ప్రదర్శించారు. అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్‌లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో రాహుల్ గాంధీని ప్రధాన ప్రతివాదిగా చేర్చడంతో పాటు, ఎంపీ పప్పు యాదవ్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీలు అవధేశ్ ప్రసాద్, రుచి వీర, ధర్మేంద్ర యాదవ్‌లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ ఐదుగురు ఎంపీలు చట్టవిరుద్ధంగా, మతపరమైన భావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని పిటిషనర్ పేర్కొన్నారు. Rahul Gandhi court complaint, Parliament skit controversy, Bihar Jamui Civil Court case, Ayodhya Ram Mandir donation skit, Opposition MPs court case, Pappu Yadav priest skit
http://www.teluguone.com/news/content/rahul-gandhi-court-complaint-39-228240.html





