మనసుకు గాయం కానంతవరకే అందరితో, అందరిలో .. ఇంట్లో, బయటా! గాయపడితే మాత్రం మనిషి మనిషిలో వుండరు.. దానికి వయసుతో నిమిత్తం లేదు. . డెబ్బయ్యేళ్లవారయినా..ఇదుగో ఈ ఆరేళ్ల రాగిన్ అయినా! అవును. రాగిన్ తల్లి శనివారం చనిపోయింది. మంగళవారం నుంచి రాగిన్ కనపడటం లేదు. ఆమె కోసం బంధువులు, స్నేహితులు, పోలీసులు కూడా వెతుకుతున్నారు.
మిన్నొసాటాలో రాగిన్ తన తల్లితో వుండేది. ఇద్దరూ మంచి స్నేహంగానూ వుండేవారట. ఏమయిందో ఏమో రాగిన్ తల్లి వేడ్ ఆత్మహత్య చేసుకుంది. 39 ఏళ్ల వేడ్ కి ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితులూ ఏమీ లేవని చుట్టుపక్కలవారూ అంటున్నారు. ఆత్మహత్య కేసు ఛేదించడం సులభమే కానీ ఇలా మనసు విరిగి ఇంట్లోంచి వెళిపోయిన పిల్లలను వెతకడం మహాకష్టం అది అనుకున్నంత సులభమైతే కాదని ఏకంగా మిన్నొసాటా పోలీసులే అంటున్నారు. ఆ పాప 2 వ తేదీన ఎవరికో కనిపించిందని విన్నారు. కానీ అందులోనూ నిజం లేదని తేలింది.
ఎవరికయినా చెప్పి వెళ్లే వయసూ కాదు. ఆమెను ఎవరూ కిడ్నాప్చేసే అవకాశమూ లేదట. మరి రాగిన్ అలా తన ఇల్లు విడిచి వెళ్లగలిగింది. మనసుకు ఎంతో దగ్గరైన తల్లి వేడ్ మరణం ఆమెను మానసికంగా కృంగదీసిందేమో అని డాక్టర్లు అంటున్నారు. కానీ అంతగా మనోవ్యధ చెందే వయసు కాదని, ఆ బాధ ఆమెకు అవగాహన వుండే అవకాశమే లేదని మరి కొందరి అభిప్రాయం. ఏమైనప్పటికీ రాగిన్ మాత్రం తను పుట్టి పెరిగిన వూరు, తన స్నేహితులను, చుట్టుపక్కలవారినీ అమాంతం వదిలేసి వెళిపోయింది. రాగిన్ తిరిగి రావాలని ఆమె స్నేహితులు ఒంటరిగా బాధపడుతున్నారు. ప్రార్ధనలు చేస్తున్నారు.
రాగిన్.. ప్లీజ్ తిరిగిరా.. నీ కోసం యావత్ మిన్నొసటా ఎదురుచూస్తోంది.
........
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/raginwhere-are-you-25-139278.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.