జగన్ కి సవాల్ గా రఘురామ! మరో హుజురాబాద్ గా నర్సాపురం? 

Publish Date:Jan 10, 2022

Advertisement

తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చి వేసింది. అధికార తెరాస ఆత్మ రక్షణలో పడింది. చివరకు నిన్న మొన్నటి వరకు గడ్డిపోచ కన్నా హీనంగా చూసిన వామపక్షాలను శరణు వేడే స్థితికి అధికార పార్టీ అహంకారం దిగి వచ్చింది.  మండలి ఎన్నికల్లో, పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి, స్వతంత్ర అభ్యర్దిగా బరిలో దిగిన మాజీ మేయర్ రవీందర్ సింగ్  ను స్వయంగా ముఖ్యమంత్రి బుజ్జగించి వెనక్కి తెచ్చుకున్నారు. అందుకే హుజూరాబాద్ ఎఫెక్ట్ కు ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు ఏపీలోనూ అదే జరగబోతోందా,అంటే, అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ హుజూరాబాద్ అయితే, అక్కడ నరసాపురం. ఇక్కడ ఈటల రాజేందర్ అయితే అక్కడ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఇక్కడ రెబెల్ ఎమ్మెల్ల్యే అయితే అక్కడ రెబెల్ ఎంపీ మిగిలినదంతా సేమ్ టూ సేమ్ అంటున్నారు.  

ఇంచుమించుగా రెండేళ్లకు పైగా, అధికార పార్టీని ప్రతి రోజూ ‘రచ్చ బండ’ కు ఈడుస్తున్న నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఇప్పుడు సొంత పార్టీఫై ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో  తాడోపేడో తేల్చుకునేందుకు ఆయన సిద్దమయ్యారు. అంతే కాదు అదేదో సినిమాలో బాలయ్య బాబు  స్పాట్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, అంటూ సవాలు విసిరిన స్టైల్లో, తనపైన అనర్హత వేటు వేయించటానికి ఎంత సమయం కావాలో చెప్పాలంటూ అధికార పార్టీకి రెబల్ ఎంపీ సవాలు విసిరారు .అందుకు ఆయనే వైసీపీ నాయకత్వానికి వారం రోజులు గడువిచ్చారు. అప్పటికీ మీతో కాకపోతే, నేనే రాజీనామా చేస్తా... ఉపఎన్నికల్లో అదే నియోజక వర్గం నుంచి పోటీ చేస్తా .. అని ప్రకటించారు. అందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. రెండు సంవత్సరాల తర్వాత, పండక్కి సొంత నియోజకవర్గానికి వస్తున్న ఆయన అక్కడి నుంచే రాజీనానామ లేఖను లోక్ సభ స్పీకర్ కు పంపేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. 

అయితే వైసీపీ నాయకులు  ఆయన విసిరిన సవాలును స్వీకరించలేదు. రఘురామ కృష్ణం రాజును తాము అంత  సీరియస్ గా తీసుకోవడం లేదని తమ అసమర్ధతను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి, మంత్రి బొత్స సత్యనరాయణ డొల్లతనం బయట పెట్టుకున్నారు.   అదలా ఉంటే, రఘురామకృష్ణం రాజు, తాను రాజీనామా చేయడం ఖాయమని మరోమారు స్పష్టం చేశారు. అంతే కాదు, ఉప ఎన్నికల్లో నరసాపురం నుంచే తిరిగి పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్త పరుస్తున్నారు. అంతే కాదు, నియోజక వర్గంలో తమ గెలుపుతో పాటుగా రేపటి ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అవసరమైన విధంగా రఘురామ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.  ఆయన ఆదరూ అనుకుంటున్నట్లుగా బీజేపీలో అయితే చేరడం లేదు..అందరి వాడుగా ఇండిపెండెంట్  గా పోటీ చేయాలని,ఆయన నిర్ణయానికి వచ్చారు. 

నిజానికి ఆయన బీజేపి తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకు  బీజేపీ  నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే రాష్ట్రంలో  నెలకొన్ని రాజకీయ పరిస్థితులో ఆయన స్వతంత్ర అభ్యర్దిగానే పోటీ చేయాలని, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేస్తే ఉమ్మడి శత్రువు, వైసీపీని ఓడించడం సులభమవుతుందని, తెలుగు దేశం, జనసేన సూచించిన నేపధ్యంలో ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్డమయ్యారని తెలుస్తోంది. తిరుపతిలో అమరావతికి మద్దతుగా జరిగిన సభకు ముందే ఈ నిర్ణయానికి వ్యూహం సిద్దమయినట్లు తెలుస్తోంది.అమిత్ షా తిరుపతి పర్యటన సందర్భంగా,అమరావతి రైతుల పాదయాత్రలో బీజేపీ నాయకులు పాల్గొనాలని ఆదేశించింది, మొదలు బీజేపీ నాయకత్వం కనుసన్నల్లో భారీ కసరత్తు జరిగనట్లు సమాచారం. ఉప ఎన్నికలో అమరావతి అంశం ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగటం ద్వారా..అమరావతికి మద్దతిస్తున్న పార్టీలు రఘురామకు మద్దతిచ్చేలా తెర వెనుక రాజకీయం నడుస్తోంది. బీజేపీ - జనసేన - బీజేపీ మద్దతుతో రఘురామను గెలిపించాలనేది ప్రస్తుత వ్యూహంగా ఉందని అంటున్నారు. 

మరోవైపు నర్సాపురంలో రాజకీయ, సామాజిక సమీకరణాలు కూడా, ప్రయోగానికి అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. నియోజక వర్గంలో మొత్తం  12 లక్షల మందికి పైగా ఓటర్లు  ఉన్నారు. అందులో 2014, 2019 రెండు సార్లు వైసీపీకి  నాలుగు నుంచి ఐదు  లక్షల ఓట్లు వచ్చాయి. అదే సమయంలో బీజేపీ ఇక్కడ రెండు సార్లు గెలిచింది. 1999లో కృష్ణంరాజు, 2014లో గోకరాజు గంగరాజు బీజేపీ అభ్యర్ధులుగా గెలిచారు. అలాగే, 2009 లో ప్రజారాజ్యం అభ్యర్ధికి 2.67 లక్షలు, 2019లో జనసేన అభ్యర్ధి నాగబాబుకు 2.50 లక్షల ఓట్లు వచ్చాయి. టీడీపీకి 4.15 లక్షల ఓట్లు వచ్చాయి. ఈలెక్కలను బట్టి చూస్తే, ఆ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు వచ్చినా రఘురామ కృష్ణం రాజు గెలుస్తారు. అలాగే, సామాజికంగా చూసినా నరసాపురంలో అయితే రాజులు (క్షత్రియులు) కాదంటే కాపులు . ఈ రెండు సామజిక వర్గాల నుంచే ఎంపీ, ఎమ్మెల్ల్యేలు గెలుస్తూ వచ్చారు. అందుకే, తెలుగు దేశం, జనసేన, బీజేపీ పార్టీల మద్దతుతో ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగాలనే నిర్ణయానికి వచ్చారు. అదలా ఉంటే, నరసాపురం ఉప ఎన్నిక నూతన రాజకీయ సమీకరణలకు శ్రీకారం చుడుతుందని అంటున్నారు. నర్సాపురం నుంచే వైసీపీ  ప్రత్యర్ధి పార్టీల కూటమి పురుడు పోసుకుంటుందని, అంటున్నారు. యుద్ధమూ అక్కడి నుంచే మొదలవుతుందని అంటున్నారు, విశ్లేషకులు.

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనూహ్య విమాన ఘటన చోటుచేసుకుంది.
సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త చర్యలకు సిద్ధమవుతోంది.
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై హెచ్చరిక చిహ్నాల అమలులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో కత్తులు చేతబట్టి నృత్యం చేసిన నలుగురు వ్యక్తులను గుడిమల్కాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
సూపర్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషి సహజ వృద్ధాప్య ప్రక్రియను నియంత్రించగలిగితే, సుమారు 1,400 సంవత్సరాల వరకు జీవించే అవకాశం
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
ప్రపంచ అందాల పోటీల చరిత్రలో కీలక మలుపు చోటు చేసుకుంది.
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, రేడియల్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల పనుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముంబయిలోని కాలాచౌకి ప్రాంతానికి చెందిన ఉదయ్ పవార్ పట్టుదల, ఆచరణాత్మక ఆలోచనలతో చిన్న స్థాయి సేవను లాభదాయక వ్యాపారంగా తీర్చిదిద్దారు.
పిల్లల కేరింతలు.. ఆటపాటలు.. ఆనందోత్సాహాల మధ్య సాగాల్సిన స్కూల్ పిక్నిక్ ఓ చిన్నారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.