రఘురామ రాజీనామా.. ఎప్పుడంటే!

Publish Date:Jan 29, 2022

Advertisement

మరో రెండు రోజులలో... జనవరి 31 (సోమవారం) నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. తొలి రోజున ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి  రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ప్రసంగిస్తారు. మర్నాడు మంగళవారం ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, 2022-23 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడతారు... ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన.. ఆపైన బడ్జెట్ పైన చర్చలు, రొటీన్ కార్యకలపాలు ఉంటాయి. 
అదలా ఉంటే, ఈ బడ్జెట్ సమావేశాల్లోనే, ఇంచుమించుగా రెండు సంవత్సరాలుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామా కృష్ణం రాజు సాగిస్తున్న రచ్చబండ రాజకీయ పోరాటం కొత్త మలుపు తీసుకుంటుందని అంటున్నారు. నిజానికి, ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ, ఎప్పుడోనే స్పీకర్’కు ఫిర్యాదు చేసింది. పార్టీ గుర్తు పైన ఎంపీగా గెలిచి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ పార్లమెంటరీ నేతలు స్పీకర్’కు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి.. లోక్ సభలో పార్టీ  ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి.. విప్ మార్గాని భరత్ పలు స్పీకర్’కు  ఆధారాలు సమర్పించారు.
అయినా ఎందుకనో స్పీకర్ కార్యాలయం స్పందించలేదు. ఈ నేపధ్యంలోనే రఘురామా వైసీపీకి సవాలు విసిరారు. దమ్ముంటే, చేతనైతే ఫిబ్రవరి 5 లోగా, స్పీకర్ తనను అనర్హునిగా ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని సవాలు విసిరారు. వైసీపీకి తనను అనర్హునిగా ప్రకటించేలా చేయడం చేతకాక పొతే, ఫిబ్రవరి 5 తర్వాత తానే రాజీనామా చేస్తానని చెప్పారు. అంతే కాదు నర్సాపురం నుంచి మళ్ళీ పోటీ  చేసి గెలుస్తానని చెప్పారు.  అదే విషయాన్ని ఆయన ప్రతి రోజు మళ్ళీ మళ్ళీ చెపుతూనే ఉన్నారు.మరో వంక రఘురామ అనర్హత విషయంలో ఇంతవరకు మౌనంగా ఉన్న, స్పీకర్ కార్యాలయంలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయంగా ఫ్రెష్’ గా వైసీపీ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ లోక్ సభ స్పీకర్ కు మరోమారు ఫిర్యాదు చేశారు. నార్సాపురం ఎంపీ  రఘురామ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని...పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయన పైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు లిఖిత పూర్వకంగానూ  ఫిర్యాదు చేశారు.ఆధారాలు సమర్పించారు. దీని పైన స్పందించిన లోక్ సభ స్పీకర్ తాజాగా ఈ పిటీషన్ ను ప్రివిలేజ్ కమిటీకి పంపారు. దీని పైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 
దీంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోగా అటో ఇటో నిర్ణయం రావచ్చని అంటున్నారు. అయితే, రఘురాం కృష్ణం రాజు అంతవరకు అగకుండా, ఫిబ్రవరి 5 ఒకటి రెండు రోజులు అటూ ఇటుగా ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి రఘురామా రాజీనామా తథ్యమని చెపుతూనే ఉన్నారు. అలాగే మళ్ళీ అదే  నర్సాపురం నుంచి పోటీ చేస్తానని, భారీ మెజారిటీతో గెలుస్తానని చెపుతూనే ఉన్నారు. సో .. ఈ బడ్జెట్  సమావేశాల్లో రఘురామ రాజు రాజీనామా ఓకే హై లైట్’గా నిలుస్తుందని అంటున్నారు. 
అదలా ఉంటే రఘురామ కృష్ణం రాజు  ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఏపార్టీలో చేరతారు? ఏపార్టీ టికెట్ మీద పోటీ చేస్తారు? అనేది మాత్రం ఇంతవరకు అయన చెప్పలేదు. అయితే, ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం అయితే బలంగా సాగుతోంది. అలాగే, ఆయన ఏ పటీలో చేరరని, ఉప ఎన్నికలవరకు అందరివాడుగా ఉండి పోతారని, ఇండిపెండెంట్  అభ్యర్ధిగా పోటీ చేస్తారని అంటునారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరుకు చేరుకోవడంతో యలహంక ప్యాలెస్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో లోతైన సాంకేతిక నైపుణ్యం కలిగిన నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
మత్తుపదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని సినీ నటుడు ప్రభాస్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆహ్వానించారు.
ఇద్దరు ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు.
అంతర్జాతీయ దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు ఇటీవల గణనీయంగా పడిపోవడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల్లో తీవ్ర చర్చ మొదలైంది.
బుల్లితెర ప్రేక్షకులను నవ్వించే జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
బంగారం ధరలు భారీగా పడిపోవడంపై ఢిల్లీకి చెందిన చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపింది.
తాళి కట్టిన 24 గంటల్లోనే బిడ్డకు జన్మ..అసలు కథేంటి.?
సర్వదర్శనానికి 8 గంటల సమయం.!
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.