Publish Date:Jul 19, 2022
ఇంగ్లీషువారు అందరికీ అంటగట్టింది క్రికెట్ పిచ్చి. దీనికి కులమతాలు, భాషా, దేశ, ప్రాంతీయ విభేదాలేమీ లేవు. క్రికెట్ అంటే చెవి కోసుకునేవారు, చదువును పక్కన పెట్టే వీరాభిమానులు అనేకమంది. అసలు దేశాల మధ్య విభేదాలను, ద్వేషభావాన్ని తొలగించే శక్తి క్రికెట్‌కే వుందని ఆమధ్య ఎవరో ఒక రాజకీయవేత్తే అన్నారు. ఇది నిజం. గతంలో పాక్‌తో భారత్ తలపడిన ప్రపంచకప్ పోటీలో భారత్ గెలిచినపుడు కెప్టెన్ ధోనీని నీ హెయిర్ స్టయిల్ బావుందయ్యా అన్నారు పాక్ ప్రధాని! అంతా ఆశ్చర్యంతో, ఆనందంతో నవ్వుకున్నారు. అలాంటిది ఇంగ్లండ్ లో ఈమధ్య జాతివివక్ష కామెంట్లు వినిపించి ఆ జాఢ్యం ఇంకా పూర్తిగా పోలేదన్నది నిరూపించింది.
ఆ మధ్య ఇంగ్లండ్ ఎడ్గ్బాస్టన్లో భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ జరిగింది. మనవాళ్లు ఎక్కడున్నా ఒకేలా గోల చేస్తారుగదా. అలా భారత్ జట్టు వీరాభిమానుల సంఘం సభ్యులు అక్కడ స్టేడియంలో జాతీయ పతాకం వూపుతూ గోల గోల చేశారు. కారణం భారత్ బ్రహ్మాండంగా ఆడుతున్న సమయమది. భారత్ అనేకాదు, ఎవరి జట్టుకు వారి వీరాభిమానులు అలానే గోల చేస్తుం టారు. ఇది చాలా సహజ దృశ్యం. కానీ తెల్లవారికి మాత్రం ఇలాంటివి బొత్తిగా నచ్చవు. ఇప్పటికీ వారి మనసులు మలినమే. ఇంకా వారిలో జాతివివక్షత ఉంది. ఇలాంటి సమయంలో అది బయటపడుతుంది.
ఎడ్గ్బాస్టన్లో జరిగిన టెస్ట్ నాలుగో రోజు భారత అభిమానులమీద ఆంగ్లేయులు తిట్ల వర్షం కురిపించారు. స్టేడియంలోని హాలీస్ స్టాండ్ వేపు వున్న ఒక భారతీయ ప్రేక్షకుడిని జాతిపేర గట్టిగానే చాలా అసహ్యంగా దూషించాడు ఓ తెల్లవాడు. ఆ దూషణలు విన్న అతని కుటుంబం అక్కడి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. అయితే ఇది గమనించిన మరి కొందరు ఇంగ్లీషు ప్రేక్షకులు మాత్రం ఆ కుటుంబం జాగ్రత్తగా స్టేడియం బయటికి వెళ్లేందుకు సహాయపడ్డారు.
కాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అధికారులు ఈ సంఘటన గురించి వాకబు చేసి ఆ వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది ఊహించనిదని దీన్ని మరీ పెద్దది చేయవద్దని అన్నారు. వారి దేశంలో జరిగింది గనుక వారికి ప్రతిష్టాభంగం కలగకుండా సంఘటనను తొక్కేశారు. ఇంతకంటే దారుణం మరొకటి వుండదు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి సంఘటనలు జరగడం అనాగరికం. ప్రపంచ దేశాలు అభివృద్ధి పధంలో ముందడుగు వేస్తున్న కాలంలో ఇంగ్లండ్ లో ఇంకా ఇలాంటి ఆలోచనలు వుండడం మానవసమాజం హర్షించదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/racial-discriminationyet-39-140050.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.