విశ్వమంత గీతానికి మూలపురుషుడు!!

Publish Date:May 9, 2022

Advertisement

భారతీయ సాహిత్యంలో మొట్టమొదటగా నోబెల్ బహుమతి అందుకున్నవారు రవీంద్రనాథ్ టాగోర్. ఈయన రచించిన గీతాంజలి కావ్య గ్రంథానికి నోబెల్ బహుమతి లభించింది. ప్రపంచ సాహిత్యాన్ని కూడా శాసించగలిగే గొప్ప కవి, నాటక రచయిత, చిత్రాకారుడు రవీంద్రనాథ్ టాగోర్. ఈయన రెండవ అన్నయ్య ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో నియమితుడైన మొట్టమొదటి భారతీయుడిగా పేరు పొందాడు. దీని కారణంగా టాగోర్ గొప్ప కుటుంబానికి చెందినవాడని అర్థమవుతుంది. అయితే టాగోర్ బాల్యం నుండి కాస్త ప్రత్యేకంగానే ఉండేవాడు. ఆయన్ను గొప్ప కవిగా చేసిన సంఘటనలు, ఆయన జీవిత ప్రయాణం తెలిస్తే అందరిలోనూ తెలియని ఉత్సాహం మేల్కొంటుంది.

బాల్యం, విద్యాభ్యాసం!!

టాగోర్ 1861 సంవత్సరంలో జన్మించాడు. ఈయన చిన్నతనంలో బడికి వెళ్లాలంటే ఆసక్తి చూపించేవాడు కాదు. అలాగని మొద్దబ్బాయి అస్సలు కాదు. ప్రతిరోజు ఉదయాన్నే లేవడం, పెరటిలోకి వెళ్లి ప్రకృతిని చూసి ఆనందపడటం ఇష్టంగా ఉండేది. ఆ తరువాత వ్యాయామం చేయడం. గణితం, చరిత్ర, భూగోళం మొదలైన పాఠ్య పుస్తక విషయాలు నేర్చుకునేవాడు. ఆ తరువాత సాయంత్రం తోటలో తిరుగుతూ ఆంగ్లం నేర్చుకునేవాడు. ఈయనకు చిన్నతనం నుండే కథలు నతే చాలా ఇష్టం ఉండేది. ప్రతి ఆదివారం సంగీతం నేర్చుకునేవాడు. కాళిదాసు, షేక్ష్పియర్ మొదలైన వారి నాటకాలు, గ్రంధాలు ఇష్టంగా చదివేవాడు. ఆయన మాతృభాష అయిన బెంగాలీ మీద ప్రత్యేకంగా ప్రేమను పెంచుకున్నాడు. 

ఆంగ్ల సాహిత్యం వైపు ప్రయాణం!!

టాగోర్ గారు ఇంగ్లాండ్ లో ఒక పబ్లిక్ స్కూల్ లో చేరి ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు వినేవారు. ఇంకా ఎంతోమంది ఉపన్యాసాలు వినేవాడు. ఎంతోమందితో ఆంగ్లంలోనే సంభాషణలు జరిపేవాడు. ఆంగ్లంలో నాటకం, సంగీత కచేరీలు మొదలైన వాటికి వెళ్లి వాటిని ఎంతో శ్రద్ధగా వింటూ ఆంగ్లం మీద ఆంగ్ల సాహిత్యం మీద పట్టు తెచ్చుకున్నాడు. ఈయన బెంగాలిలో రచించిన ఎన్నో కవితలను ఏర్చి కూర్చి గీతాంజలిగా పేరు పెట్టాడు. దీన్ని  ఆంగ్లంలోకి అనువదించిన తరువాత టాగోర్ కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది.

శాంతినికేతన్!!

గీతాంజలి మనుషుల మనసుల్లో ప్రేమతత్వాన్ని స్పర్శించి, దాన్ని వెలికి తీసే ఒక అద్భుతం. అయితే టాగోర్ పిల్లలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వాళ్ళను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో స్థాపించినదే శాంతినికేతన్ విశ్వవిద్యాలయం. ఇది అయిదు మంది పిల్లలతో మొదలై ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు సంపాదించుకుంది. అక్కడ విద్యను అభ్యసించిన వారికి ఒకానొక ప్రత్యేక వ్యక్తిత్వం ఏర్పడటం ఎంతో గొప్ప విషయంగా భావించేవారు. గొప్ప క్రమశిక్షణ కలిగిన జీవితం వారికి సొంతమయ్యేది.

మరొక కోణం!!

టాగోర్ అంటే చాలామందికి కేవలం గీతాంజలి రచయితగా పరిచయం అవుతారు కానీ ఈయన నవలలు, నాటకాలు కూడా రాశారు. ఇంకా ముఖ్యంగా రవీంద్ర సంగీతం అనే ప్రత్యేక వర్గాన్ని సృష్టించిన గొప్ప సంగీత పిపాసి ఈయన. ఈయన రచించిన నవలల్లో గోరా ఈయనకు  ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అలాగే నాటకాలలో చిత్రాంగద నాటకం మంచి పేరు తెచ్చిపెట్టింది.

సామాజిక చైతన్యం వైపు!!

టాగోర్ కు సామాజిక స్పృహ ఎప్పుడూ ఎక్కువగానే ఉండేది. ఆయన జీతీయభావాలు పుష్కలంగా కలిగి ఉండేవాడు. తిలక్ ను బ్రిటీష్ ప్రభుత్వం బంధించినప్పుడు తీవ్రంగా విమర్శించాడు. బెంగాల్ విభజన సమయంలో ప్రముఖ పాత్ర పోషించాడు. చివరికి ఈయన రచించిన జనగణమన జాతీయగీతంగా మారి ఈ దేశం నిలిచి ఉన్నంత వరకు టాగోర్ ఉనికిని జీతంలో ప్రతిబింబిస్తూ ఉంది, ఉంటుంది.

విశ్వకవి బిరుదును సొంతం చేసుకున్న ఈయన విశ్వాన్ని తన కలంతో శాసించాడు.

                                  ◆వెంకటేష్ పువ్వాడ.

By
en-us Political News

  
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.