వెలుగులోకి వచ్చిన మరో అక్రమ సరోగసి
Publish Date:Aug 15, 2025
Advertisement
తీవ్ర సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసు మరువక ముందే మరో ఘటన కుత్బు ల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పరిధిలో ఓ అక్రమ సరోగసి సెంటర్ ఉన్నట్లుగా విశ్వసనీ యమైన సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. అయితే ఒక క్లినిక్ సెంటర్ అనుమతి లేకుండా సరోగసి సెంటర్ నిర్వహిస్తున్నది. ఈ సెంటర్ పై పోలీ సులు దాడులు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు... ఈ సందర్భంగా మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి మాట్లాడుతూ... పేట్ బషీరాబాద్ పరిధిలో ఉన్న ఒక క్లినిక్ సెంటర్లో అక్రమంగా సరోగసి సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ క్లినిక్ గతంలో అనుమతి కోసం అప్లై చేసు కుంది. కానీ అనుమతులు రాకపోవడంతో అక్రమంగా సరోగసి సెంటర్ నిర్వహిస్తూ భారీ ఎత్తున డబ్బులు సంపాది స్తున్నారు. పక్కా సమాచారం రావడంతో అక్రమ సరోగసికి పాల్ప డుతున్న వ్యక్తుల్ని, ఎగ్ డొనేట్ చేస్తున్న వారిని అరెస్టు చేశామని డిసిపి కోటిరెడ్డి అన్నారు. హైదరాబాదులో ఏడుగురు మహిళలు, ఒక పురుషున్ని మొత్తం ఎనిమిది మందిని కమర్షియల్ సరోగసి, అక్రమ ఎగ్ ట్రేడింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నర్రెద్దుల లక్ష్మీ రెడ్డి లక్ష్మి గతంలో ఎగ్ డోనర్, సరోగసి మదర్ గా పనిచేసిన అనుభవం ఉంది. గత అనుభవంతో సులభ పద్ధతిలో డబ్బులు సంపా దించాలని నిర్ణయిం చుకున్న లక్ష్మీ అక్రమ సరోగసి విధానానికి తెరలేపింది. లక్ష్మీ రెడ్డి కుమారుడు నరేందర్ రెడ్డి జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీర్గా చదువుతున్నాడు. ఇతను కూడా అమ్మకు తోడుగా ఈ అక్రమ దందా లోకి దిగాడు. వీరు పిల్లలు లేని జంటలను టార్గెట్ గా చేసుకొని సరో గసి ద్వారా పిల్లల్ని నీకు అప్ప జెప్పు తామని నమ్మించి వారి వద్ద నుండి 15 నుండి 20 లక్షల రూపాయలు వసూలు చేస్తు న్నారు. ఆ తర్వాత డబ్బు అవసరం ఉన్న పేద మహిళలను టార్గెట్గా చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి... ఎగ్ డొనేట్ చేయించడం తో పాటు సరోగసికి బలవంతంగా ఒప్పిస్తున్నారు.. పక్క సమాచారం రావడంతో లక్ష్మీ రెడ్డి, ఆమె కుమా రుడు నరేందర్ రెడ్డిని అరెస్టు చేసామని డిసిపి తెలిపారు. లక్ష్మిరెడ్డి 2024లో మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉంది... వీరిద్దరూ కొన్ని హాస్పిటల్స్ కు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు.అరెస్టు చేసిన వారి వద్ద నుండి 6.47 లక్షల నగదు, లెనోవో లాప్టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు తోపాటు సిరంజీలు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజక్షన్లు, హెగ్డే హాస్పిటల్ కేస్ షీట్లు, 5 స్మార్ట్ ఫోన్లు, ఒక కీప్యాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. సరోగసి రెగ్యులేషన్ యాక్ట్, అసిస్టెడ్ రిప్రొడక్టవ్ టెక్నాలజీ యాక్ట్, బి ఎన్ ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని నిందితులిద్దరిని అరెస్టు చేశామని... మిగతా గ్యాంగ్ సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని మేడ్చల్ జిల్లా డిసిపి కోటిరెడ్డి వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/qutbullahpur-police-station-25-204293.html





