Publish Date:Aug 15, 2025
తీవ్ర సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసు మరువక ముందే మరో ఘటన కుత్బు ల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పరిధిలో ఓ అక్రమ సరోగసి సెంటర్ ఉన్నట్లుగా విశ్వసనీ యమైన సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. అయితే ఒక క్లినిక్ సెంటర్ అనుమతి లేకుండా సరోగసి సెంటర్ నిర్వహిస్తున్నది. ఈ సెంటర్ పై పోలీ సులు దాడులు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు... ఈ సందర్భంగా మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి మాట్లాడుతూ... పేట్ బషీరాబాద్ పరిధిలో ఉన్న ఒక క్లినిక్ సెంటర్లో అక్రమంగా సరోగసి సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ క్లినిక్ గతంలో అనుమతి కోసం అప్లై చేసు కుంది. కానీ అనుమతులు రాకపోవడంతో అక్రమంగా సరోగసి సెంటర్ నిర్వహిస్తూ భారీ ఎత్తున డబ్బులు సంపాది స్తున్నారు. పక్కా సమాచారం రావడంతో అక్రమ సరోగసికి పాల్ప డుతున్న వ్యక్తుల్ని, ఎగ్ డొనేట్ చేస్తున్న వారిని అరెస్టు చేశామని డిసిపి కోటిరెడ్డి అన్నారు.
హైదరాబాదులో ఏడుగురు మహిళలు, ఒక పురుషున్ని మొత్తం ఎనిమిది మందిని కమర్షియల్ సరోగసి, అక్రమ ఎగ్ ట్రేడింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నర్రెద్దుల లక్ష్మీ రెడ్డి లక్ష్మి గతంలో ఎగ్ డోనర్, సరోగసి మదర్ గా పనిచేసిన అనుభవం ఉంది. గత అనుభవంతో సులభ పద్ధతిలో డబ్బులు సంపా దించాలని నిర్ణయిం చుకున్న లక్ష్మీ అక్రమ సరోగసి విధానానికి తెరలేపింది. లక్ష్మీ రెడ్డి కుమారుడు నరేందర్ రెడ్డి జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీర్గా చదువుతున్నాడు. ఇతను కూడా అమ్మకు తోడుగా ఈ అక్రమ దందా లోకి దిగాడు. వీరు పిల్లలు లేని జంటలను టార్గెట్ గా చేసుకొని సరో గసి ద్వారా పిల్లల్ని నీకు అప్ప జెప్పు తామని నమ్మించి వారి వద్ద నుండి 15 నుండి 20 లక్షల రూపాయలు వసూలు చేస్తు న్నారు.
ఆ తర్వాత డబ్బు అవసరం ఉన్న పేద మహిళలను టార్గెట్గా చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి... ఎగ్ డొనేట్ చేయించడం తో పాటు సరోగసికి బలవంతంగా ఒప్పిస్తున్నారు.. పక్క సమాచారం రావడంతో లక్ష్మీ రెడ్డి, ఆమె కుమా రుడు నరేందర్ రెడ్డిని అరెస్టు చేసామని డిసిపి తెలిపారు. లక్ష్మిరెడ్డి 2024లో మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉంది... వీరిద్దరూ కొన్ని హాస్పిటల్స్ కు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు.అరెస్టు చేసిన వారి వద్ద నుండి 6.47 లక్షల నగదు, లెనోవో లాప్టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు తోపాటు సిరంజీలు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజక్షన్లు, హెగ్డే హాస్పిటల్ కేస్ షీట్లు, 5 స్మార్ట్ ఫోన్లు, ఒక కీప్యాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. సరోగసి రెగ్యులేషన్ యాక్ట్, అసిస్టెడ్ రిప్రొడక్టవ్ టెక్నాలజీ యాక్ట్, బి ఎన్ ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని నిందితులిద్దరిని అరెస్టు చేశామని... మిగతా గ్యాంగ్ సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని మేడ్చల్ జిల్లా డిసిపి కోటిరెడ్డి వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/qutbullahpur-police-station-39-204292.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.