ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. ఎన్నికల సమయంలో ఆయనపై నమోదైన కేసును ఏపీ హైకోర్టు క్వాష్ చేసింది. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ కు మద్దతు పలికిన సంగతి తెలిసిందే.
ఆ సందర్భంగా వేల సంఖ్యలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అక్కడకు చేరుకున్నారు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్న సమయంలో ముందస్తు అనుమతి లేకుండా అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహించారంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చేసిన ఫిర్యాదు మేరకు నంద్యాల పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ పై కేసు నమోదు చేశారు.
ఆ కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు ఇరు పక్షాల వాదనా విన్న తరువాత బుధవారం (నవంబర్ 6) తీర్పు వెలువరించింది. అల్లు అర్జున్ పై కేసును క్వాష్ చేస్తూ తీర్పు ఇచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/quash-case-on-allu-arjun-25-187953.html
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది