2009లోనే మూడు ఫైవ్‌స్టార్ హోటల్స్ ఉన్నాయి .. కేటీఆర్ హాట్ కామెంట్స్.!

Publish Date:Oct 1, 2026

Advertisement

మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!

తెలంగాణలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు రైతులు కరెంట్, రైతుబంధు, యూరియా కోసం అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. కనీసం ఆరు గంటలు కూడా విద్యుత్ అందడం లేదని రైతులు తన దృష్టికి తీసుకొస్తున్నారని చెప్పారు.‘‘మీరు మా పక్షాన నిలబడి ఈ ప్రభుత్వంపై పోరాడాలి’’ అని ప్రజలు కోరుతున్నారని కేటీఆర్ అన్నారు. రైతుబంధు రావడం లేదని, యూరియా దొరకడం లేదని రైతులు కంటతడి పెడుతున్నారని చెప్పారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఫోన్ చేస్తే యూరియా పొలం వద్దకే వచ్చేదని రైతులు చెబుతున్నారని తెలిపారు. కేసీఆర్ అప్పట్లోనే ‘‘మోసపోకండి.. మోసపోతే గోసపడతాం’’ అని హెచ్చరించారని, ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణలో కనిపిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పదేళ్లు పాలన చూశాం.. కొత్తవారికి అవకాశం ఇద్దామని ప్రజలు భావించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.

కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు.!

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీరు, విద్యుత్ విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి గత పరిస్థితులను తిరిగి తీసుకొస్తానని చెప్పారని.. ఇప్పుడు రైతులకు కన్నీళ్లు తెప్పించే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా-ఈ రేసు తదితర అంశాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్లను ప్రస్తావిస్తూ.. వాటి పేరుతో పెద్ద ఎత్తున రాజకీయ ప్రచారం చేసినా చివరకు ఏమి తేలలేదని కేటీఆర్ విమర్శించారు.ప్రజల దృష్టిని మళ్లించేందుకే గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారెంటీలపై ప్రజలు ప్రశ్నిస్తారని భయంతో ఇతర అంశాలను తెరపైకి తెస్తున్నారని అన్నారు.

సిరిసిల్లలో నేతన్నల సమస్యలపై ప్రశ్నలు.!

సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి నేతన్నల సమస్యలపై స్పష్టమైన ప్రకటన చేస్తారని తాము ఆశించామని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆరోపించారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు, స్కూల్ యూనిఫాం ఆర్డర్లు నిలిచిపోయాయని, నేతన్న బీమా పరిస్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు పరిహారం ప్రకటిస్తారని ఆశించినా.. ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు.

రేవంత్‌పై వ్యక్తిగత విమర్శలు.!

సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి తన కుటుంబ ఆస్తులు, వ్యాపారాలపై చేసిన వ్యాఖ్యలపైనా కేటీఆర్ స్పందించారు. తాను అమెరికాలో ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో 2006లో హోటల్ వ్యాపారం ప్రారంభించానని చెప్పారు. తన ఆస్తులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్లలోనే వెల్లడించానన్నారు. తన అఫిడవిట్లలో ఉన్న విషయాలను కొత్తగా బయటపెట్టినట్టుగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. వ్యాపారం చేసుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. తనకు భార్య, పిల్లలకు జీవనం కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. రేవంత్‌రెడ్డి తనపై ఎన్ని విమర్శలు చేసినా.. ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటానని కేటీఆర్ స్పష్టం చేశారు.

హామీలపై నిలదీస్తూనే ఉంటాం..!

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఎస్సీ, యువత, రైతు, బీసీ డిక్లరేషన్లపై కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. దళితబంధు కింద రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదని ఆరోపించారు. బీసీలకు లక్ష కోట్ల నిధులు, కాంట్రాక్టులు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.మైనారిటీలకు రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, రైతుబీమా వంటి పథకాలు నిలిచిపోయాయని ఆరోపించారు.రాహుల్ గాంధీ, బీజేపీ ఇచ్చిన హామీలను కూడా కేటీఆర్ ప్రస్తావిస్తూ.. ఎన్నికల హామీల అమలుపై అన్ని పార్టీలను ప్రజలు ప్రశ్నించాలని అన్నారు.

‘మళ్లీ కేసీఆర్ నాయకత్వమే’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు.!

గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజలు కేసీఆర్‌ను గుర్తుచేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ తిరిగి వస్తే తెలంగాణ మళ్లీ అభివృద్ధి బాటలోకి వస్తుందని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలో రైతులు, పేదలు సంతోషంగా ఉండాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని కేటీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, ప్రజలు ఆ పార్టీకి తగిన సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

 

 

 

[ KTR, KTR Hot Comments, KTR Hotels, KTR Five Star Hotels, KTR Business, KTR Affidavit, CM Revanth Reddy,Telangana Politics, BRS, Congress, Telangana News, KTR Counter, KTR Latest News, Telangana Political News ]

By
en-us Political News

  
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.