క్వాంటమ్ వ్యాలీకీ ఆర్థిక సాయం అందించండి..అశ్వనీ వైష్ణవ్‌తో లోకేష్ భేటీ

Publish Date:Aug 18, 2025

Advertisement

 

అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ ఆవిష్కరణలు, విధానపరమైన సంస్కరణల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్‌కు  సహకారం అందించాలని మంత్రి నారా లోకేష్ కేంద్రానికి విజ్జప్తిచేశారు. రాష్ట్రానికి ఇటీవల సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడంపై కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వనీ వైష్టవ్ కు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

 మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఐటి పెట్టుబడులను ప్రోత్సహించడం వల్ల వలసలను తగ్గించి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. టైర్ -3 నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఐటి పరిశ్రమ విస్తరించేలా ఆదాయపన్ను మినహాయింపులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం అత్యవసరంగా పర్మినెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ రూల్స్ లో  సవరణలు చేపట్టండి. విదేశీ క్లౌడ్ సర్వీసు ప్రొవైడర్లు భారత్ లో పెట్టుబడి పెట్టడానికి, ప్రపంచ పోటీతత్వాన్ని మెరుగుపర్చడానికి ఇది అనివార్యం. ఆంధ్రప్రదేశ్ లో ఐపిని కాపాడుతూ పరివర్తనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వీలుగా ఎఐ శిక్షణ,  టెక్స్ట్ అండ్ డాటా మైనింగ్ మినహాయింపుల కోసం సెక్షన్ – 52కి కాపీరైట్ చట్టసవరణ చేపట్టాలి. 

భారతదేశంలో మొట్టమొదటి జాతీయస్థాయి క్వాంటమ్ క్లస్టర్ గా అమరావతి క్వాంటమ్ వ్యాలీ పార్కును, రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ కు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా  అధికారికంగా కేంద్రస్థాయి ఆమోదం తెలపాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్జప్తిచేశారు. క్వాంటమ్ వ్యాలీకి రూ. 1000 కోట్లు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు రూ. 300 కోట్లు సాయం అందించండి. రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ ను సెంట్రల్ ఇన్నొవేషన్ అండ్ డిజిటల్ హెల్త్ మిషన్ లో చేర్చండి. అమరావతిలో గ్లోబల్ క్వాంటమ్ సమ్మిట్, ఇండియా ఇన్నోవేషన్ వీక్ – 2026ను నిర్వహణకు అవకాశం కల్పించండి. 

అమరావతిలో నేషనల్ క్వాంటమ్ రిసెర్చి ఇనిస్టిట్యూట్, ఐఐటి/ఐఐఎస్ సి సహకారంతో నేషనల్ క్వాంటమ్ మిషన్ ఆధారిత డీప్ టెక్ స్కిల్ అకాడమీ ఏర్పాటు చేయండి. జాతీయ విద్యావిధానం – 2020 (NEP) కింద ఫెలో షిప్ ప్రోగ్రామ్ లు, ఎఐ యూనివర్సిటీ, పాఠశాల స్థాయిలో స్టెమ్ పాఠ్యాంశాలను ఏకీకృతం చేయడానికి కేంద్ర సహకారం అందించండి. డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్లోబల్ డాటా సెంటర్ల పెట్టుబడులను ఆకర్షించడానికి విశాఖపట్నంలో సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ పనులను వేగవంతం చేయండి. ఎలక్ట్రానిక్స్ తయారీ, సెమీ కండక్టర్స్, డిస్ప్లే ఫ్యాబ్ లు, గ్లోబల్ ఐటి సామర్థ్యాల కోసం ఎపి ప్రభుత్వం 2024-25లో ప్రకటించిన నూతన విధానాన్ని వివరిస్తూ విశాఖపట్నంలో ఐటి పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహకాలను అందించాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేసిన ప్రతిష్టాత్మక ఇన్నొవేషన్ ఎకోసిస్టమ్, డేటా ఇంటిగ్రేషన్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, AI & డీప్ టెక్, విజువల్ ఇంటెలిజెన్స్, పీపుల్ పర్సెప్షన్, పబ్లిక్ అలర్ట్ ప్లాట్‌ఫామ్‌ల పనితీరును ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తమ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టుల్లో డేటా లేక్, RTGS లెన్స్, PGRS, CPGRAMS, అన్నదాత సుఖీభవ, డ్రోన్ మార్ట్, KPI డాష్‌బోర్డ్‌లు, AWARE ప్లాట్‌ఫామ్, ఉద్యోగుల పనితీరు ట్రాకింగ్ సాధనాలు ఉన్నాయని చెప్పారు. 

డేటా సెంటర్ పార్కు, క్వాంటమ్ వ్యాలీ, ఆర్ టిఐహెచ్ లను వికసిత్ భారత్ -2047లో అంతర్భాగాలుగా బ్రాండింగ్ చేసేందుకు, ఆంధ్రప్రదేశ్ ను జాతీయస్థాయి ఆవిష్కరణల్లో ముందంజలో ఉంచేందుకు కేంద్రం మద్దతు అందించాల్సిందిగా కోరారు. సమగ్ర డిజిటల్ నైపుణ్య పెంపుదల, ఇ-గవర్నెన్స్, డీప్ టెక్ పరిశోధన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న స్టెమ్ విద్య కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంపై చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ర్యాపిడ్ టెక్ ఇంక్యుబేషన్, క్వాంటమ్, బయోటెక్, గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో ఎంఎస్ఎంఇల ప్రోత్సాహానికి ఎపిలో సంస్కరణలను అమలు చేసేందుకు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్టవ్ అంగీకారం తెలిపారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.