శ్రీవారికి భారీ బంగారు కానుక

Publish Date:Sep 24, 2025

Advertisement

 

తిరుమల శ్రీవారికి వైజాగ్‌కు చెందిన హిందుస్థాన్ ఎంటర్‌ ప్రైజెస్‌  ఎండి పువ్వాడ మస్తాన్ రావు, కుంకుమ రేఖ దంపతులు భారీ బంగారు కానుక అందించారు. రూ.3.86 కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని స్వామి వారికి బహూకరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు.. దాతలను అభినందించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, భాను ప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతారాం పాల్గోన్నారు.

మరోవైపు బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.  టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈఓ అశోక్‌ సింఘాల్‌ పర్యవేక్షణలో వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఎగురవేశారు.

ధ్వజస్తంభంపై ఎగిరే ఈ గరుడ పతాకమే బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా సకల దేవతలను, అష్టదిక్పాలకులను, ఇతర గణాలను ఆహ్వానించే శుభ సూచికమని అర్చకులు వివరించారు. ధ్వజారోహణం అనంతరం శ్రీ మలయప్ప స్వామి వారు ఏడు తలల పెద్దశేష వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.
 

By
en-us Political News

  
జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి..
బర్త్‌డే ప్లాన్ వెనుక దాగున్న భారీ కుట్ర..
డిగ్రీ లేకుండానే ఏఐతో అద్భుతాలు సృష్టిస్తున్న ఆయుష్ సింగ్..
తమిళనాడు సీఎం విజయ్ ఉదారత..
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలో ఒక ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది.
చంచల్‌గూడ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి విమర్శల పర్వం ఊపందుకుంది.
హైదరాబాద్ నగరంలో గుండెల్ని పిండేసే ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వేస్ట్..
నాగరాజు ఉండటం వల్లే తమ ప్రాంతంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి ముఠాల ఆగడాలు అణచివేయబడ్డాయని, తాము ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అసలేం జరుగుతోంది, ఏం జరగాల్సి ఉందన్న విషయంపై ప్రముఖ విశ్లేషకుడు సుంకర వెంకటేశ్వరరావు (సువేరా) తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్టాడారు.
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో యువకుడు సాయికృష్ణ కస్టడీలో మృతి చెందడం
షాపూర్ ప్రాంతంలో వరద ముంపునకు గురవుతున్న అట్టడుగు వర్గాలు, నిర్వాసితుల పక్షాన నిలబడి నిలదీసే ఒక సాహసోపేతమైన గొంతుగా భరత్ భూషణ్ తివారికి అక్కడ ఇమేజ్ ఉంది. అధికారుల అవినీతిని, ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అక్రమాలను నేరుగా ఫీల్డ్ నుంచే కెమెరాలకు చూపిస్తూ.. నేరుగా పేర్లు పెట్టి హెచ్చరించే తివారి ధోరణి స్థానిక పాలకులకు, అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
కేవలం ఇదొక జీవన విధానం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక భారీ వ్యాపార సామ్రాజ్యంగా అవతరించిందని ప్రముఖ విశ్లేషకులు భరద్వాజ చెప్పారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తాజా లెక్కల ప్రకారం భారతదేశంలో ఈ కో లివింగ్ మార్కెట్ విలువ అక్షరాలా 4,000 కోట్ల రూపాయలకు చేరిందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.