పులివెందుల సమరం.. పీక్స్ కు చేరిన టెన్షన్లు
Publish Date:Aug 11, 2025
Advertisement
పులివెందుల తీర్పు పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం కావడానికి ఇక కొన్ని గంటలే ఉంది. ఈ నేపథ్యంలో పులివెందులలో పోలింగ్ హీట్ పీక్స్ కు చేరింది. పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉప ఎన్నిక ఫలితంపై పులివెందుల, కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, ఆ మాటకొస్తే దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఏదో ఒక మండలానికి చెందిన ఎన్నికలా కాకుండా ఈ ఉప ఎన్నిక యుద్ధ వాతావరణాన్ని తలపించేంత ఉద్రిక్తత, ఉత్కంఠ రేపుతోంది. మంగళవారం (ఆగస్టు 12) జరగనున్న ఈ ఉప పోరును తెలుగుదేశం కూటమి ,వైసీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా దాడులు, ప్రతిదాడులు జరగడంతో ఇక పోలింగ్ ఇప్పటికే ప్రచార సందర్భంగా పోలింగ్ దాడులు జరగడం తో పోలింగ్ రోజున పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ సైన్యం దిగితే... తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి పార్టీలు ప్రైవేటు సైన్యాన్ని దించారన్న ప్రచారం ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో పులివెందులలో దౌర్జన్యానికి పై చేయి అవుతుందా? ప్రజాస్వామ్యానిదా? అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం కూటమి, వైసిపి నేతలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ప్రచార ఘట్టంలోనే హింసాత్మక ఘటనలు జరగడంతో పోలింగ్ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే పోలింగ్ రోజు తమకు అనుకూలంగా ఓటింగ్ జరుపుకునేందుకు బయట వ్యక్తులు పులివెందులకు చేరుకున్నారన్న ప్రచారంతో స్థానికులలో ఆందోళన వ్యక్తం అవుతోంది. పోలీసులు పోలింగ్ ముందు రోజు నుంచే కొత్త వ్యక్తులు పోలింగ్ జరిగే పులివెందులలో కానీ ఒంటిమిట్టలో కానీ ఉండకూడదని హెచ్చరించారు. ఇక ప్రలోభాల పర్వం కూడా పెద్ద ఎత్తున సాగుతోందంటున్నారు. పోటాపోటీగా, ప్రతిష్టాత్మకంగా మారిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నకలో ఓటు చాలా కాస్టీగా మారిపోయిందని పరిశీలకులు చెబుతున్నారు. ఓటుకు పది వేల చొప్పున ఇస్తున్నారంటూ తెలుగుదేశం కూటమి, వైసీపీలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఒంటిమిట్టలో కూడా జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా పులివెందుల స్థానం అంత కాకపోయినా.. ఓటుకు నోటు భారీగానే ఇస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం రెండు జట్పీసీలకు కలిపి..దాదాపు పాతిక కోట్ల పంపిణీ జరుగుతోందని అంచనా వేస్తున్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఇంత కాస్టీగా మారడం ఇదే ప్రథమం అంటున్నారు. ఇక పులివెందుల బరిలో స్థానానికి వై.ఎస్.ఆర్.సి.పి అభ్యర్థిగా తుమ్మల హేమంత్ రెడ్డి, తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా
బిటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున అభ్యర్ధి రంగంలో ఉన్నారు. మరి కొందరు స్వతంత్రులు కూడా రంగంలో ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థుల మధ్యే ఉంది. ఇక ఒంటిమిట్ట జడ్.పి.టి.సి అభ్యర్థిగా వైసీపీ తరఫున ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా ముద్దు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయభాస్కర్ తో పాటు మరో 8 మంది స్వంతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడా పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీల మధ్యే ఉంది.
http://www.teluguone.com/news/content/pulivendula-zptc-by-poll-39-204016.html





