అమరావతిపై మరోసారి జగన్ విషం.. ప్రజాగ్రహ సెగతో వైసీపీలో భయం!

Publish Date:Jan 10, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జగన్ అక్కసు తెలియంది కాదు. తాను అధికారంలో ఉండగా అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులంటూ సృష్టించిన గందరగోళ, అయోమయ పరిస్థితులే గత అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒక్కటన్నది నిర్వివాదాంశం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతిపై జగన్ కుట్రల ఫలితమే.. 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం. వైసీపీకి కనీసం ప్రతిక్ష హోదాకు కూడా అర్హత లేదని జనం ఆ ఎన్నికలలో తమ ఓటు ద్వారా విస్పష్ట తీర్పు ఇచ్చి 11 స్థానాలతో ఆ పార్టీని సరిపెట్టారు. కూటమి సర్దు బాట్ల కారణంగా కొన్ని స్థానాలలో వైసీపీ విజయం సాధించింది. లేకపోతే ఆ ఓటమి మరింత ఘోరంగా ఉండేదని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించిన సంగతి తెలిసిందే. 

అయితే అంతటి ఘోర పరాజయం తరువాత కూడా అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్. తాజాగా అమరావతి నదీగర్భంలో నిర్మిస్తూ చంద్రబాబు ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. అమరావతి నిర్మాణం ప్రజాధనం వ్యయంగా అభివర్ణించిన ఆయన రాష్ట్ర రాజధానిని విజయవాడ, గుంటూరు జాతీయ రహదారికి సమీపంలో నిర్మించాలన్నారు. అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. అమరావతిపై జగన్ ద్వేషం వెళ్లగక్కుతున్నారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. 

దీంతో నష్ట నివారణకా అన్నట్లుగా మాజీ మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగారు. జగన్ వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చడానికా అన్నట్లు హెరిటేజ్ కార్యాలయాన్ని నదీ గర్భంలో నిర్మించగలరా  అన్న జగన్ ప్రశ్నకు ముందు నారా చంద్రబాబు, ఆయన కుటుంబం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  అమరావతి విషయంలో జగన్ మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ మాట్లాడారు. జగన్ అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 24 గంటలలో పేర్ని నాని రంగంలోకి దిగడం, జగన్ వ్యాఖ్యల తీవ్రతను డైల్యూట్ చేసేలా మాట్లాడటం చూస్తుంటే అమరావతి విషయంలో వైసీపీ తీరు పట్ల ప్రజా వ్యతిరేక సెగలు వైసీపీకి మరోసారి గట్టిగా తగిలాయనే భావించాల్సి వస్తోంది.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ మద్యం కుంభకోణం విషయంలో విజయసాయిరెడ్డి సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇక ఇటీవలి కాలంలో ఆయన ట్వీట్లు, కామెంట్లు అన్నీ కూడా ఆయన కషాయ దళంలో చేరనున్నారన్న ప్రచారానికి కారణమయ్యాయి. తాజాగా విజయసాయి రెడ్డి ఆ ప్రచారంలో ఇసుమంతైనా అవాస్తవం లేదనిపించేలా సామాజిక మాధ్యమం వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.
రాజకీయంగా సిద్ధాంతాలు ఎంత ముఖ్యమో, నేతలతో ఆత్మీయ పలకరింపు కూడా అంతే ముఖ్యమన్న లోకేష్ అంతటితో ఆగకుండా.. ఏఐ క్వాంటం ఎంత అవసరమో మనవీయ సంబంధాలూ అంతే అవసరమని చెప్పారు. కుటుంబాలతో బంధం బలోపేతం కోసమే డిన్నర్ సమావేశాలని చెప్పారు.
ఇప్పటి వరకు సాధించిన .. ఇంకా ఏం సాధించాల్సిన అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించినట్లు చెప్పిన విత్త మంత్రి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
రూ.3,32,205 కోట్లతో పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లుగా అంచనా వేశారు. ఇక రెవెన్యూ లోటు రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు. ద్రవ్య లోటు రూ.75,868 కోట్లుగా అంచనా వేశారు.
ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోట అనుకున్న ప్రాంతాలలో కూడా మునిసిపోల్స్ లో బీఆర్ఎస్ చతికిల పడటం చూస్తుంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. కరీంనగర్, నిజామాబాద్ వరంగల్ లలో ఆదరణ లేకుండా పోయింది. ఇక దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.
మెదక్ జిల్లాలో  మెదక్, నర్సాపూర్ మునిసిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. అలాగే,  కరీంనగర్ జిల్లాలో వేములవాడ, మెట్ పల్లి, రాయికల్ , కోరుట్ల, జమ్మికుంట మునిసిపాలిటీలలో హంగ్ ఏర్పడింది.
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ విజయంపై సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ విజయం లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమకు దక్కిన ఫలితంగా అభివర్ణించారు.
బీఆర్ఎస్ కార్పొరేటర్ కిడ్నాప్ అయ్యారన్న వార్తలు వెలువడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్ ను కాంగ్రెస్ కిడ్నాప్ చేసిందని బీఆఱ్ఎస్ ఆరోపిస్తున్నది. 32వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన గుగులోతు రాంబాబు కిడ్నాప్ నకు గురయ్యారనీ, కాంగ్రెస్ నాయకులే రాంబాబును బలవంతంగా తీసుకెళ్లారని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆరోపించారు.
మునుగోడు మీరు చూసుకోండి… తెలంగాణ నేను చూసుకుంటా అంటూ ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తనకు అడుక్కోవడం రాదన్న ఆయన.. పార్టీ తనకు ఇచ్చిన మాటకు కట్టుబడి మర్యాదగా మంత్రి పదవి డిమాండ్ చేశారు. అలా ఇవ్వకుంటే లాక్కునే స్థాయికి వెడతానని హెచ్చరించారు.
పోటీలు పడి మరీ ఓట్ల కోసం డబ్బులు పంచుకుంటూ పోతే ఏపీ దివాళా తీస్తుందని హెచ్చరించారు. ఎన్నికల హామీల అమలు అంటూ కేటాయింపులు చేయడం వల్ల బడ్జెట్ మొత్తం సంక్షేమ పథకాలకే సరిపోతోందన్న పీవీ రమేష్ దీని వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని హెచ్చరించారు.
పయ్యావుల బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఇక సభలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. ఇక మండలిలో బడ్జెట్ ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ బడ్జెట్ ను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశ పెడతారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది.
హుజూరాబాద్ మునిసిపాలిటీ ఫలితం బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటుందని అంతా భావించారు. తీరా ఫలితాలు వెల్లడయ్యేసరికి హూజూరాబాద్ మునిసిపాలిటీని కాంగ్రెస్ ‘హస్త’గతమైంది. హుజూరాబాద్ మునిసిపాలిటిలో 16 వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. బీఆర్ఎస్ కేవలం ఎనిమిది స్థానాలకు మాత్రమే పరిమితమై కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.