వైసీపీ మినీ ప్లీనరీగా పీఎస్సార్ అంజనేయులు కుమారుడి వివాహ వేదిక.!
Publish Date:Aug 22, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుక ఉభయ తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో జరిగిన ఈ వివాహం కుటుంబ వేడుకగా కాకుండా.. వైసీపీ నేతల గ్యాదరింగ్ గా మారి పొలిటికల్ అటెన్షన్ కు కారణమైంది. పీఎస్సార్ ఆంజనేయులు కుమారుడి వివాహానికి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీకి చెందిన కీలక నేతలు హాజరయ్యారు. జగన్, అంబటి రాంబాబు, కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీకి చెందిన పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఈ వివాహానికి హాజరయ్యారు. వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది. ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది. ఇటీవల కాలంలో వైఎస్సార్సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి. మాజీ పోలీస్ ఉన్నతాధికారి కుటుంబంలో జరిగిన వేడుకకు ఒక రాజకీయ పార్టీకి చెందిన నేతలు ఈ స్థాయిలో హాజరుకావడం రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకోవడమే కాకుండా కొత్త చర్చకు దారి తీసింది. గతంలో వైపీపీ అధికారంలో ఉన్న సమయంలో పీఎస్సార్ ఆంజనేయులు ఏపీ పోలీస్ శాఖలో కీలకమైన పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. నిఘా విభాగం అధిపతిగా బాధ్యతలు చేపట్టిన కాలంలో ఆయన వైసీపీ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరించారన్న ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత.. ఆయన చట్టపరమైన వివాదాలు, కేసులలో చిక్కుకోవడం వి తెలిసిందే. ముఖ్యంగా ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీకి సంబంధించిన వేధింపుల కేసు, అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో జరిగిన అక్రమాల ఆరోపణల కేసులలో ఆంజనేయులు పేరు ప్రముఖంగా ఉంది. జెత్వానీ వ్యవహారంలో ఆయన్ను ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. ఆ తరువాత ఆయనకు బెయిల్ లభించింది అది వేరే సంగతి. ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో వివాదాస్పదంగా వ్యవహరించి ఆరోపణలు, విమర్శలూ ముటగట్టుకున్న ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమారుడి వివాహానికి వైసీపీ అగ్రనేతలంతా తరలిరావడం అప్పటి ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఉందని పరిశీలకులు అంటున్నారు. PSR Anjaneyulu son marriege in Hyderabad, YS Jagan Mohan Reddy, YCP Leaders, Hyderabad Wedding Gathering, AP IPS Officer, TeluguOne
http://www.teluguone.com/news/content/psr-anjaneyulu-son-marriege-in-hyderabad-39-229541.html





