చిరంజీవి నెత్తిన తిరుపతి భారం
Publish Date:Mar 27, 2012
Advertisement
చిరంజీవి రాజ్యసభకు ఎన్నిక కావడంతో తిరుపతి అసెంబ్లీ సీటుకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. తాను ఖాళీ చేసిన ఈ సీటుని తన భార్య సురేఖతో భర్తీ చేయాలని చిరంజీచి మొదట భావించారు. అయితే దీనికి అధిష్టానం సుముఖంగా లేకపోవడంతో పార్టీ ఎవరికీ టిక్కెట్ ఇస్తే వారిని గెలిపించడానికి కృషి చేస్తానని చిరంజీవి మాట వరసకు అన్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా అభ్యర్థి ఎంపిక బాధ్యతను, అతన్ని గేలించుకునే కర్తవ్యాన్ని కూడా చిరంజీవికే అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం 18 శాసనసభ స్థానాల ఎంపిక గురించి మంత్రులతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రాథమిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తిరుపతి అభ్యర్థి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ భారం చిరంజీవికే వదిలేద్దామని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో చిరంజీవికి తిరుపతి బరువు బాధ్యతలు మోయకతప్పేట్లు కనిపించడం లేదు. చిరంజీవికి ఈ బాధ్యతను అప్పగించడం ద్వారా కొంత బరువును దించుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ చిరంజీవి సూచించిన అభ్యర్థి ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆ వైఫల్యం చిరంజీవిపై నెట్టివేసి ఆయన పరపతిని తగ్గించవచ్చు. ఒకవేళ చిరంజీవి సూచించిన అభ్యర్థి గెలిస్తే దానికి పెద్ద్డగా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉండదనేది కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహంగా తెలుస్తోంది. కానీ చిరంజీవి సన్నిహితులు ఈ అంశంపై మరోరకంగా ఆలోచిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక బాధ్యతను చిరంజీవికి అప్పగిస్తే ఆయన గల్లా జయదేవ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో తనకు సుమారు రూ.8 కోట్ల వరకు ఎన్నికల వ్యయం అయిందని, ఆ డబ్బును తిరిగి తనకు అందజేసే షరతుతో ఆయన గల్లా జయదేవ్ పెద్రును ప్రతిపాదించవచ్చని తెలుస్తోంది. జయదేవ్ వల్ల గతంలో పెట్టిన ఖర్చులు తనకు తిరిగి వస్తే సరిపోతుందన్న భావనతో చిరంజీవి ఉన్నారు. జయదేవ్ గెలిస్తే ఆ క్రెడిట్ చిరంజీవికే దక్కుతుంది. ఒకవేళ ఓడిపోతే అది పార్టీ వైఫల్యంగా ప్రచారం చేయవచ్చని చిరంజీవి వర్గం భావిస్తున్నట్లు తెలుస్తుంది.
http://www.teluguone.com/news/content/prp-chief-chiranjeevi-tirupati-constituency-24-12935.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





