రోడ్‌షోను నిర్వహించిన పి&జి హైదరాబాద్ ప్లాంట్

Publish Date:Feb 28, 2024

Advertisement

ఇతరత్రా సామర్థ్యాలు గల వారు (వికలాంగులు) రూపొందించిన పెయింటింగ్‌లను ఆవిష్కరించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైంది, 'అందరికీ ఇక్కడ స్వాగతం' అనే సైనేజ్ ను ప్రదర్శించడం ద్వారా ప్లాంట్‌లో అందరికీ స్థానం ఉంటుందనే  బలమైన సందేశాన్ని అందించింది.

హైదరాబాద్, 26 ఫిబ్రవరి, 2024: టైడ్, ఏరియల్, ప్యాంపర్స్ మొదలైన బ్రాండ్‌ల తయారీ సంస్థ ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా (P&G ఇండియా) హైదరాబాద్ లో దేశంలోని తన అతిపెద్ద తయారీ కేంద్రం వద్ద 'ఈక్వాలిటీ అండ్ ఇన్‌క్లూజన్ రోడ్‌షో' రెండవ ఎడిషన్‌ను నిర్వహించింది. అందరికీ అవకాశాలు కల్పించడంపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో జరిగిన ఈ రోడ్‌షో సంస్థలోని అన్ని స్థాయిల నుండి విభిన్న ఉద్యోగుల సమూహాన్ని ఒక్క చోటుకు తీసుకువచ్చింది. సాంకేతిక నిపుణులు, లైన్ వర్కర్ల నుండి మేనేజర్ల వరకు వివిధ స్థాయిలకు చెందిన ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. కొత్త నియమించబడిన వారి నుంచి నుండి దశాబ్దాల అనుభవంకంపెనీ సీనియర్ ఉద్యోగులు దీనికి హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ఆకర్షణీయమైన సెషన్‌లు, చర్చలు జరిగాయి.   పక్షపాతాలను గుర్తించడానికి, అడ్డంకులను అధిగమించడానికి ఇవి వారికి తోడ్పడ్డాయి. సమాజంలోని భిన్న వర్గాలను మరింతగా కూడగట్టుకుంటూ తమ ప్రయాణంలో ముందుకు సాగుతామని వారు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

పి అండ్ జి చేపట్టిన సమానత్వం, చేకూర్పు వ్యూహం సంపూర్ణమైనది, సమగ్రమైనది. లింగ సమానత్వం, ఎల్జీబీటీక్యూ ప్లస్ తది తరులను చేర్చడం, వైకల్యాలున్న వ్యక్తులను చేర్చడం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించే ప్రయత్నాలతో అందరినీ చేర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. సంస్థ మునుపటి ఎడిషన్ సాధించిన విజయం నేపథ్యంలో ఈ సంవత్సరం నిర్వహించిన కార్యక్రమం కూడా ప్రఖ్యాత నిపుణులు,  అతిధులను ఒకచోట చేర్చింది. భారతదేశంలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరిన మొదటి లింగమార్పిడి వ్యక్తి డాక్టర్ రూత్ జాన్ పాల్, సెన్స్ – ఇట్ –ఐస్ వ్యవస్థాపకురాలు, శిక్షకురాలు, సున్నిత అంశాలపై వర్క్ షాప్స్ నిర్వాహకురాలు శ్రీమతి పాయల్ కపూర్,  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమం  ప్రెగ్నెన్సీ సిమ్యులేటర్‌ల నుండి భారతీయ సైన్ లాంగ్వేజ్    ప్రాథమిక విషయాలపై  ఉద్యోగుల్లో అవగాహన మరియు సానుభూతిని పెంపొందించడానికి తోడ్పడింది. 

పి అండ్ జి ఇండియా  మావన వనరుల విభాగం అధిపతి శ్రీనివాస్ పి.ఎం. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఒక కంపెనీగా మేం ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలోని బిలియన్ల మంది వినియోగదారులకు సేవలందించడానికి ప్రగాఢంగా కట్టుబడి ఉన్నాం. మేం మా వినియోగదారుల వైవిధ్యాన్ని గౌరవించి, దానిని ప్రతిబింబించేటపుడు, వారి ప్రత్యేక అవసరాలను పూర్తిగా అర్థం చేసుకున్న ప్పుడు వారికి అత్యుత్తమ ఉత్పత్తులు, సేవలతో అందించడాన్ని మేం మరింత ఉత్తమంగా చేస్తాం అనే దాన్ని మేం నిజంగా విశ్వసిస్తు న్నాం. ఇది పి అండ్ జి లో మా సంస్కృతిలో పొందుపరచబడింది. మా వినియోగదారుల వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం మరియు ప్రతిబింబించడం ఇక్కడే - మా కార్యాలయంలోనే ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరికీ అత్యుత్తమ బ్రాండ్ అనుభవాలను అందించడానికి లోతైన దృక్పథాలను పొందడంలో ఇక్కడ మా ఉద్యోగులు మాకు సహాయపడతారు. దీనికి అనుగుణంగా, మా సంస్కృతికి మూలస్తంభంగా ఉన్న సమానత్వం, చేరికను మేం ప్రోత్సహించడం కొనసాగించాం. ప్రతి ఉద్యోగి తమ సొంత వ్యక్తిత్వాలతో కార్యాలయానికి రావచ్చు. మా విభిన్న ఉద్యోగుల యొక్క విభిన్న జీవిత దశ అవసరాలను తీర్చడానికి అందించబడిన అనేక ప్రత్యేక కార్యక్రమాలు మరియు కార్యాలయ విధానాల ద్వారా ఇది మరింత బలపడుతుంది’’ అని అన్నారు.

ఆయన ఇంకా ఇలా అన్నారు, ‘‘ ఈ సంవత్సరం రోడ్‌షో రెండవ ఎడిషన్‌తో మేము మా ఉద్యోగులను చేకూర్పు యొక్క  నిజమైన ప్రచారకర్తలుగా మార్చడానికి ప్రయత్నించాం. ఇక్కడి విధానాలు మరియు రూపుదిద్దుకున్న అనుసంధానతలు ప్రతి ఒక్కరూ తమ ఉత్తమమైన సహకారాన్ని అందించే నిర్దిష్ట చర్యలుగా మారుతాయని మేం విశ్వసిస్తున్నాం. మా ఉద్యోగులు వారి కమ్యూనిటీలకు తిరిగి వచ్చినప్పుడు, వారు చేకూర్పులకు ప్రచారకర్తలుగా మారారు.  వారుఈ సందర్భాన్ని వేగాన్ని ముందుకు తీసుకువెళతారు మరియు పి అండ్ జి వెలుపల సైతం సానుకూల మార్పును ప్రేరేపిస్తారు’’.

సంవత్సరాలుగా పి అండ్ జి హైదరాబాద్ సైట్ చేకూర్పుపై ఆలోచనలు చేసే అగ్రగామిగా అభివృద్ధి చెందింది. నైట్ షిఫ్టుతో సహా అన్ని తయారీ షిఫ్టులలో మహిళా సాంకేతిక నిపుణులను కలిగి ఉన్న మొదటి కంపెనీలలో P&G ఇండియా ఒకటి. ప్రభుత్వంతో కలసి పని చేయడం ద్వారా మహిళా టెక్నీషియన్ సిబ్బందికి అవసరమైన అనుమతులు సాధించింది. వారి వృద్ధికి అవకాశాలను తెరిచింది.    ప్రతి ఒక్కరూ విలువైన మానవవనరుగా పరిగణించబడే కార్యాలయంలో విశ్వసనీయ, చేకూర్పు సంస్కృతిని సంస్థ కొనసాగించింది.   అభివృద్ధి చెందడానికి సమానమైన అవకాశాలను అందించడాన్ని ప్లాంట్ కొనసాగించింది.

పి అండ్ జి ఇండియా తన ప్రధాన కార్పొరెట్ సామాజిక బాధ్యత కార్యక్రమం అయిన ‘పి అండ్ జి శిక్షా’ ద్వారా  కూడా తాను సేవలందిస్తున్న కమ్యూనిటీలను అర్ధవంతంగా ప్రభావితం చేయడం కొనసాగించింది. హైదరాబాదులో సంవత్సరాలుగా, పి అండ్ జి శిక్షా ద్వారా, కంపెనీ విద్యాపరమైన మౌలిక సదుపాయాల పెంపుదల, పిల్లలలో అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి మరియు అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడానికి గాను వారి చదులుకు సహాయం చేసింది. ఈ సంవత్సరం, పి అండ్ జి శిక్షా తన డిజిటల్ రెమెడియల్ లెర్నింగ్ ప్రోగ్రాం - మైండ్‌పార్క్‌ ని తెలంగాణలోని గిరిజన సంఘాలకు చెందిన వేలాది మంది పిల్లలపై కూడా ప్రభావం చూపేలా విస్తరించింది. ఇది తెలంగాణ, మహారాష్ట్రలో రాష్ట్ర గిరిజన శాఖల భాగస్వామ్యంతో ప్రత్యేకంగా నిర్వహించబడిన కార్యక్రమం. ఇంకా, పి అండ్ జి ఇండియా ‘పి అండ్ జి శిక్షాబేటియన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్’ ద్వారా రాష్ట్రంలోని కళాశాలల్లో స్టెమ్  విద్యను అభ్యసిస్తున్న బాలికలకు ఆర్థిక సహాయం, మార్గదర్శకత్వం కూడా అందిస్తుంది.

సమానత్వం, చేరికను ముందుకు తీసుకెళ్లేందుకు కంపెనీ చేస్తున్న నిరంతర ప్రయత్నాల పైన ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. ఏరియల్ #ShareTheLoad వంటి ఉద్యమాల ద్వారా అవగాహన పెంచడం మరియు మూస పద్ధతులను సవాలు చేయడం కావచ్చు, అలాగే టెక్ మరియు ఐటీలో అపోహలను బద్దలు కొట్టడం మరియు లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంపై సంభాషణలను నడిపించే వార్షిక ‘ఉమెన్ ఇన్ టెక్’ సమ్మిట్ వంటి సమగ్ర చర్యల ద్వారా కావచ్చు. కంపెనీ తన శ్రామిక శక్తి కోసం విభిన్న సమ్మిళిత విధానాలను కూడా అందిస్తుంది మరియు తన ఎల్జీబీటీక్యూ ప్లస్ తదితర ఉద్యోగుల భాగస్వాములకు అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ఉదాహరణకు, ‘షేర్ ది కేర్’ అనేది  సొంత తల్లిదండ్రులు, డొమెస్టిక్ పార్ట్ నర్స్, పెంపుడు తల్లిదండ్రులు, స్వలింగ జంటలలోని తల్లిదండ్రులతో సహా కొత్త తల్లిదండ్రులందరికీ 8 వారాల పూర్తి చెల్లింపు పేరెంటల్ లీవ్‌ను అందించే పేరెంటల్ లీవ్ పాలసీ
 

By
en-us Political News

  
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.