కేబినెట్ మార్పుతో వైసీపీలో సంక్షోభం!.. ర‌గిలిపోతున్న అసంతృప్తులు!?

Publish Date:Apr 8, 2022

Advertisement

ఉన్న కుంప‌ట్లు స‌రిపోన‌ట్టు.. కేబినెట్ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌తో జ‌గ‌న్‌రెడ్డి మ‌రిన్ని కష్టాలు కోరి తెచ్చుకున్నారని అంటున్నారు. 24 మంది మంత్రులు రాజీనామాలు చేసి.. తామంతా హ్యాపీగానే చేశామ‌ని బ‌య‌ట‌కు చెబుతున్నా.. వారి మాడిపోయిన ముఖాలు చూస్తేనే తెలిసిపోతోంది వారెంత అసంతృప్తితో ఉన్నారో. మనసులో ఏ బాధ, ఏ భావం ఉన్నా, ఎవరికి వారు మరో మాట మాట్లాడకుండా.. రాజీనామా లేఖ‌లు జ‌గ‌న‌న్న‌కు ఇచ్చేసి.. జేబుల్లో చేతులు పెట్టుకుని మౌనంగా అలా నడుచుకుంటూ వెళ్లి పోయారు. అంత‌ర్గ‌తంగా అల‌క‌లు, లుక‌లుక‌ల‌తో తాజా మాజీలంతా జ‌గ‌న‌న్న‌పై ర‌గిలిపోతున్నార‌ని తెలుస్తోంది. మూడేళ్లుగా మంత్రిగా ప‌ద‌వి అనుభ‌విస్తే.. ఇప్పుడు స‌డెన్‌గా తీసేస్తే.. తమపై అస‌మ‌ర్థుల‌మ‌నే ముద్ర ప‌డుతుంద‌ని.. ప్ర‌జ‌ల ముందు త‌లెత్తుకునే ప‌రిస్థితి ఉండ‌ద‌ని మండిప‌డుతున్నారు. కొంద‌రు సీనియ‌ర్లు అయితే నేరుగా జ‌గ‌న్ ద‌గ్గ‌రే త‌మ అస‌హ‌నం వెల్ల‌గ‌క్కార‌ని చెబుతున్నారు. కొడాలి నాని అయితే మూడు రోజుల ముందే అధినేత‌కు ప‌రోక్షంగా ప‌బ్లిక్‌గా వార్నింగ్ కూడా ఇచ్చేశారు. అందుకే, సీఎం జ‌గ‌న్ మ‌ళ్లీ పున‌రాలోచ‌న చేస్తున్నార‌ని.. ఓ 10 మందిని తిరిగి కేబినెట్‌లోకి తీసుకుంటార‌ని కొత్త‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది. అది మ‌రో కొత్త స‌మ‌స్యకు దారి తీస్తోంది. బొత్సా, పెద్దిరెడ్డి, సురేశ్‌లాంటి వాళ్ల‌కు మ‌రోసారి ఛాన్స్ ఇస్తే.. వాళ్లు బెస్ట్‌, తామంతా వేస్ట్ అనే మెసేజ్ ప్ర‌జ‌ల్లోకి వెళుతుంద‌ని, తాము నియోజ‌క‌వ‌ర్గంలో చుల‌క‌న అవుతామ‌ని వాపోతున్నారు తాజా మాజీలు. 

సామాజిక సమీకరణాల కారణంగా కొంద‌రు మంత్రులను మ‌ళ్లీ కొనసాగించక తప్పదని ముఖ్యమంత్రి భావిస్తున్నార‌ని తెలుస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి సురేశ్‌కు మ‌ళ్లీ ఛాన్స్ ఇవ్వ‌నున్నార‌నే ప్ర‌చారం అదే జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆగ్రహం తెప్పించింది. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుజ్జగించినా ఆయన అలక వీడలేదు. ఉంటే ఇద్దరం ఉండాలి.. లేదంటే ఇద్దరినీ తొలగించాల్సిందేనని ప‌ట్టుబ‌డుతున్నార‌ట బాలినేని. బాలినేనిని జగన్‌ పిలిపించుకుని మాట్లాడారని.. సురేశ్‌ కొనసాగి తీరుతారని సీఎం సూటిగా చెప్పినట్టు తెలిసింది.

ఏపీ మంత్రి వర్గ కూర్పుపై సమీకరణాలు మారుతున్నాయి. సీనియర్లు అలకపాన్పు ఎక్కడం జగన్‌కు తలనొప్పిగా మారింది. అయితే ఏడాది క్రితం ప్రమాణస్వీకారం చేసిన వేణుగోపాల్ కృష్ణ, అప్పలరాజుపై స్పష్టత వచ్చింది. కొత్తగా కేబినెట్‌లోకి శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్, అనకాపల్లి నుంచి గుడివాడ అమర్‌నాథ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీ, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి, దెందులూరు ఎమ్మెల్యే కె.అబ్బయ్యచౌదరి (కమ్మ), కోనసీమ జిల్లాలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు(ఎస్సీ), ఎన్‌టీఆర్‌ జిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు(ఎస్సీ)ల‌కు బెర్తు ఖాయమని అంటున్నా రు. మైనారిటీ కోటాల్లో హఫీజ్‌ఖాన్, ముస్తఫాల్లో ఒకరికి చోటు కల్పించబోతున్నారు. అలాగే రెడ్డి, కాపు సామాజిక వర్గాలకు ఒక్కో పదవి కట్ కాబోతోంది. తగ్గించిన పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లభించే అవకాశమున్నట్లు సమాచారం.

ఇక‌, మూడేళ్లుగా కళ్ల‌ల్లో వత్తులు వేసుకుని మంత్రి పదవి  కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఆర్కే రోజా అండ్ కో పరిస్థితి ఏమిటి? అనే చర్చ పార్టీలో జరుగుతోంది. తొలి మంత్రి వర్గంలోనే పదవి ఆశించి భంగపడిన ధర్మాన, ఆనం, తమ్మినేని, అంబటి, కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి.. ఇలా చాలామందే తాజా విస్తరణలోనూ ఆశలు పెట్టుకున్నారు. ఇలా జిల్లాల వారీగా లిస్ట్ భారీగానే ఉంది. కొత్త కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వి వ‌స్తే ఓకే, లేదంటే..? ఆశావ‌హులంతా అసంతృప్తితో, అస‌హ‌నంతో, ఆగ్ర‌హంతో ర‌గిలిపోవ‌డం ఖాయం. అది పార్టీలో సంక్షోభానికీ దారి తీయొచ్చు అంటున్నారు. తిరుగుబాటు ఛాన్సెస్ ఎక్కువ‌గానే ఉన్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఎందుకంటే...

గ‌తంలో అయితే జ‌గ‌న్‌కు పార్టీ కేడ‌ర్ అంతా క‌ట్టప్ప‌లా కట్టుబ‌డి ఉండేది. అప్ప‌ట్లో ఆయ‌నే సుప్రీం. ఆయ‌న‌ చెప్పిందే శాస‌నం. ఇస్తే మంత్రి.. పీకేస్తే మాజీ. వైసీపీ బిగ్ బాస్ జ‌గ‌న్‌రెడ్డి. ఇదంతా గ‌తం. ఆ రోజులు పోయాయి. ఇప్పుడలా త‌లొగ్గే ప‌రిస్థితి లేదు. క‌రెంట్ కోత‌లు, విద్యుత్ ఛార్జీలు, పీఆర్సీతో ఉద్యోగులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు.. ఇలా వివిధ వ‌ర్గాల‌ ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌టంతో.. జ‌గ‌న‌న్న‌ను న‌మ్ముకొని మ‌రోసారి గెలిచే ప‌రిస్థితి లేద‌నే గ్ర‌హింపున‌కు వ‌చ్చేశారు ఎమ్మెల్యేలు. అందుకే, స్వ‌తంత్రంగా ఉనికి చాటుకునేందుకు సిద్ధం అవుతున్నారు. జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ప‌డుండేందుకు చాలామంది ఇష్ట‌ప‌డ‌టం లేదు. ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో, నియోజ‌క‌వ‌ర్గాల్లో రెబెల్స్ సంఖ్య భారీగా పెరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేల‌పై దిగువ‌శ్రేణి నాయ‌కులు తిరగ‌బ‌డుతుంటే.. ఇప్పుడు స్వ‌యంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే అధినేత‌కు ఝ‌ల‌క్ ఇచ్చేందుకు సై అంటున్నారు. కాక‌పోతే స‌రైన స‌మ‌యం కోసం మౌనంగా వేచి చూస్తున్నారంతే. 

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.