కాంగ్రెస్ పగ్గాలు ఇక ప్రియాంకకు? రాహుల్ గాంధీయే ప్రతిపాదిస్తారా?

Publish Date:Jul 13, 2024

Advertisement

కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీకి ఉన్న గుర్తింపే వేరు. ఆమె దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోలికలతో ఉంటారనీ, ఆమె మాట తీరు, నిర్ణయాలు తీసుకునే వేగం అన్నీ ఇందిరాగాంధీని స్ఫురణకు తీసుకువస్తాయన్నది మెజారిటీ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల భావన. ఇప్పటి వరకూ ఆమె ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొన్నది అంతంత మాత్రమే.

అయితే ఈ సారి మాత్రం ఆమె రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వాయనాడ్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. కేరళలోని వాయనాడ్ నుంచి ఆమె అభ్యర్థిత్వం ఖరారు కాగానే ఒక్క సారిగా కాంగ్రెస్ పార్టీలో ఆమె ప్రాధాన్యత పెరిగిపోయింది. మున్ముందు ప్రియాంకగాంధీయే ఇందిరాగాంధీ రాజకీయ వారసురాలిగా రాజకీయాలలో చక్రం తిప్పుతారన్న పార్టీ వర్గాలలో గ ట్టిగా వినిపిస్తున్నది. వాయనాడ్ నుంచి ఆమె ఎన్నికైన క్షణం నుంచీ రాజకీయాలలో పెనుమార్పులకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సారథ్యం ఆమె చేతుల్లోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రియాంక కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. కాగా సామాన్య జనంలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వరుసగా మూడు పరాజయాల తరువాత రాహుల్ గాంధీలో ఎంత పరిణితి కనిపిస్తున్నప్పటికీ పార్టీ మొత్తం ఆయన నాయకత్వాన్ని సంపూర్ణంగా అంగీకరించడం లేదు. అలాగే సంకీర్ణ యుగంలో కాంగ్రెస్ నేతృత్వంలో పని చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న పార్టీలు కూడా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి భవిష్యత్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీపైనా కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. 

అయితే ఇప్పటి వరకూ ఆమె తన సోదరుడు రాహుల్ గాంధీ కోసమే తన ప్రచారం, తన రాజకీయం అని చెబుతూ వస్తున్నారు. అంటే ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో లీడ్ రోల్ తీసుకోవాలంటే అందుకు ముందుగా రాహుల్ గాంధీ ప్రతిపాదించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీకి ప్రధాని అవ్వాలన్న కాంక్ష కంటే బీజేపీ దుష్టపాలన నుంచి దేశానికి విముక్తి కలిగించాలన్న లక్ష్యమే బలంగా ఉందని, ఆ కారణంతో నిజంగా కాంగ్రెస్ బలోపేతానికి ప్రింయాక గాంధీ లీడ్ రోల్ పోషించాలని ఆయన కన్విన్స్ అయితే క్షణం ఆలోచించకుండా వెనక్కు తగ్గి ప్రియాంకను ముందు పీఠిన నిలబెడతారని కాంగ్రెస్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.

By
en-us Political News

  
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.