ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉపఎన్నికలు.. ఇండియా కూటమి హవా

Publish Date:Jul 13, 2024

Advertisement

సార్వత్రిక ఎన్నికలలో గట్టిగా పుంజుకున్న కాంగ్రెస్ మంచి జోష్ మీద ఉంది. సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక స్థానాలలో విజయం సాధించి అధికారంలోకి రాలేకపోయినా ఇండియా కూటమి గణనీయంగా పుంజుకుంది.  ఎన్నికలల విజయం సిద్ధించకపోయినా బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ అవతరించింది.  గత రెండు సందర్భాలలోనూ అంటే 2014, 2019 ఎన్నికలలో వలె బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేందుకు అవసరమైన స్థానాలు దక్కాయి. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు సంగతి దేవుడెరుగు కనీసం విపక్షంగా ఉండేందుకు అసమైర స్థానాలకు  దక్కించుకోలేకపోయింది. అయితే 2024 ఎన్నొకతు వచ్చే సరికి కాంగ్రెస్ స్వయంగా బలం పుంజుకోవడమే కాకుండా, కేంద్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినన్ని స్థానాలు బీజేపీకి లభించకుండా చేయడంలో సక్సెస్ అయ్యింది. 

ఇప్పుడు ఏడు రాష్ట్రాలలోని 13 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 10న జరిగిన ఉప ఎన్నికలలో   కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి హవా సాగుతోంది.  ఈ ఉప ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలి విజయాన్ని నమోదు చేయగా,  మిగతా 12లో 10 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  లోక్‌సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ మార్కు అందుకోలేకపోయిన బీజేపీ, మెజార్టీ మార్కుకు చేరువగా వచ్చిన కాంగ్రెస్ కూటమి ఈ ఎన్నికలను సవాలుగా తీసుకున్నాయి.

పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, బీహార్‌లలో ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డా, రాణాఘాట్, మణిక్తల, రాయ్‌గంజ్‌లోని నాలుగు స్థానాల్లోనూ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది.  ఉత్తరాఖండ్‌లోని మంగ్లావుర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఖాజీ నిజాముద్దన్ తన సమీప బీఎస్పీ అభ్యర్థి ఉబేదెర్ రెహ్మాన్‌పై ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు.  అలాగే బద్రీనాథ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లఖ్‌పత్ సింగ్ బుటోలా స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు.  పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్‌లో ఆప్ అభ్యర్థి మొహిందర్ భగత్ విజయం సాధించారు.

ఇక్కడి నుంచి విజయం సాధించిన ఆప్ ఎమ్మెల్యే శీతల్ అంగురల్ బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.  తమిళనాడులోని విక్రవంది అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ లీడింగ్‌లో ఉన్నారు. బీహార్‌లో జేడీయూ అభ్యర్థి కళాధర్ ప్రసాద్  మండల్  పై చేయి సాధించారు. 

మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా అమర్వారా నియోజకవర్గంలో బీజేపీ, హిమాచల్ ప్రదేశ్‌లో తొలుత వెనకబడిన కాంగ్రెస్ పుంజుకుని ఆధిక్యంలోకి దూసుకొచ్చింది.   డేహ్రాలో తొలుత వెనకబడిన సీఎం సుఖ్విందర్ సుఖు భార్య కమలేశ్ ఠాకూర్ ముందంజలో ఉన్నారు. 

By
en-us Political News

  
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.