యూపీలో ప్రియాంక ఫ‌స్ట్‌.. 'ఉన్న‌వో' అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్

Publish Date:Jan 13, 2022

Advertisement

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ట్యాలీ సింగల్ డిజిట్ దాటదని, ఇప్పుడున్న ఏడు సీట్లు గెలవడం కూడా కష్టమే అని సర్వేలు చెపుతున్నాయి. అయితే , పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా,ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే పట్టుదలతో   మెడకు సాగుతున్నారు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా, పటు వదలని విక్రమార్కునిలా పోరాట పటిమను చూపుతున్నారు. అందుకే  గెలుపు ఓటములు ఎలా ఉన్నా, ప్రియాకా వాద్రా పట్టుదలను మాత్రంఆమె  రాజకీయ ప్రాథేయర్థులు కూడా  మెచ్చుకుంటున్నారు. 

నిజానికి, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, బీజేపీ, ఎస్పీ, బీఎస్పీల కంటే కాంగ్రెస్ పార్టీ అనేక విషయాల్లో ఒకడుగు ముందే ఉంది. ఇతర పార్టీ ఏవీ ఎన్నికల  ప్రచారం గురించి ఆలోచించక ముందే ప్రియాంక పాదయాత్రలతో ప్రచారం ప్రారంభించారు. ఆడపిల్లలకు స్కూటీలు, మహాళలకు మరొకటి ఇలా మహిళల ను ఆకట్టుకునే విధంగా మినీ మ్యానిఫెస్టో విడుదల చేశారు. మహిళలకు 40 శాతం  టిక్కెట్లు  ఇస్తామని ప్రకటించారు.ఇక ఇప్పుడు ఎన్నికల షెడ్యూలు విడుదలై న  నేపథ్యంలో డిజిటల్ ప్రచారానికి కూడా  ప్రియాంకే ..  ముందుగా శ్రీకారం చుట్టారు. 

ఇక ఇప్పుడు అభ్యర్థుల ప్రకటనలోనూ ప్రియనక ఫస్ట్ ఉన్నారు. ఆమె ఈరోజు (గురువారం)ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాను .తొలి  జాబితాలో మొత్తం 125 మంది అభ్యర్థులను ప్రకటించగా, వీరిలో 50 మంది మహిళలు, 50 మంది యువత ఉన్నారు.  కాగా, ఈ సందర్భంగా ప్రియాంక  మహిళలకు 40 శాతం, యువతకు 40 శాతం స్థానాలను ఇచ్చినట్లు తెలిపారు. ఈ చరిత్రాత్మక చర్య ద్వారా రాష్ట్రంలో నూతన తరహా రాజకీయాలను తీసుకురాగలమని ఆశిస్తున్నట్లు చెప్పారు. నిజం రాజకీయాలు నేరమయమవుతున్ననేపధ్యంలో మహిళలు, యువతకు పెద్ద పీట  వేయడం నిజంగా స్వాగతించదగిన పరిణామంగానే పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే, ఉన్నావ్  శాసన సభ నియోజకవర్గం నుంచి ఓ అత్యాచార బాధితురాలి తల్లిని పోటీలో నిలుపుతున్నట్లు తెలిపారు. ఆశా వర్కర్లకు గౌరవ వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించిన పూనం పాండేను షాజహాన్ పూర్ నుంచి పోటీ చేయిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లో న్యాయం కోసం పోరాడినవారిని తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించామని చెప్పారు. అటువంటివారు ముందుకు వచ్చి, రాష్ట్రంలో అధికారంలో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు చెప్పారు. 

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని మీడియా అడిగినపుడు ప్రియాంక గాంధీ వాద్రా సమాధానం చెప్పలేదు. ఈ ఎన్నికల్లో నెగెటివ్ ప్రచారం చేయబోమని, ఉత్తర ప్రదేశ్ భవిష్యత్తు కోసం పాజిటివ్ ప్రచారం చేస్తామని అన్నారు. మహిళలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అభివృద్ధి అంశాలను ప్రస్తావిస్తామని తెలిపారు. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నవో అత్యాచారం కేసు యూపీ ఎన్నికల్లో మరోసారి చర్చనీయాంశంగా మారనుంది. యూపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నవో అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది.కుల్దీప్ సింగ్ సెంగార్ ఓ బాలికపై అత్యాచారం చేశాడు.ఈ ఘటనలో నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ జైలు పాలయ్యారు. అత్యాచార బాధిత బాలికను హతమార్చేందుకు బీజేపీ ఎమ్మెల్యే కుట్ర పన్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధిత బాలికకు సుప్రీం అండగా నిలిచింది.

403 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. 

By
en-us Political News

  
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో పర్యటించారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనూహ్య విమాన ఘటన చోటుచేసుకుంది.
సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త చర్యలకు సిద్ధమవుతోంది.
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై హెచ్చరిక చిహ్నాల అమలులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో కత్తులు చేతబట్టి నృత్యం చేసిన నలుగురు వ్యక్తులను గుడిమల్కాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.