ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం

Publish Date:Nov 10, 2025

Advertisement

ఇటీవల వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రయాణమంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నాయి. కర్నూలు బస్సు ప్రమాద ఘటన వంటిదే మరో సంఘటన మంగళవారం ఉదయం సంభవించింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం తప్పింది. వివరాలిలా ఉన్నాయి.  హైదరాబాద్ నుంచి కందుకూరు వెడుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్, విజయవాడ జాతీయరహదారిపై  చిట్యాల మండలం పిట్టంపల్లి వద్దు మంటల్లో చిక్కుకుంది. ముందుగా బస్సులో పొగలు వ్యాపించడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి.. ప్రయాణీకులను కిందకు దించేశాడు.

 దీంతో పెను ప్రమాదం తప్పి.. ప్రయాణీకులంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సు మంటల్లో దగ్ధమైంది. ఈ ఘటనకు ముందు బస్సును డ్రైవర్ చౌటుప్పల్ వద్ద టీ బ్రేక్ కోసం ఆపాడు. మళ్లీ బస్సు బయలుదేరిన పది నిముషాలకే బస్సు మంటల్లో చిక్కుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణీకులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ అప్రమత్తత కారణంగానే తాము క్షేమంగా బయటపడగలిగామని వారు చెబుతున్నారు. 

By
en-us Political News

  
ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రంప్ కు స్వాగతం పలికేందుకు చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్ స్వయంగా విమానాశ్రయానికి రావడమే చైనా అగ్రరాజ్యాధినేత పర్యటనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నది అవగతమౌతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత కీలకమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ పెవిలియన్‌లో మెగా గ్రోత్ కారిడార్ ప్రణాళికలపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు సీఎం చంద్రబాబు తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించారు.
రాష్ట్రాన్ని ఆర్ధికంగా మరింత పటిష్ట పరిచేందుకు వ్యవస్థలో సామర్ధ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
ప్రజాస్వామ్యం వచ్చింది. పాలకుండలాంటి ఓటు హక్కును తెచ్చింది.
నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు దర్యాప్తు నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ వ్యవహారంలో చిక్కుకుని చివరకు సస్పెన్షన్‌కు గురయ్యాడు.
గచ్చిబౌలి ప్రాంతంలో లిఫ్టులు ఇరుక్కుని చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బంగారాన్ని బ్యాంకింగ్ రంగంలోకి తీసుకొచ్చి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది.
అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్నది ప్రధాన ఆరోపణ. కేసులోని కీలక సాక్షులను ప్రలోభపెట్టడమే కాకుండా, తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన బెదిరించినట్లు పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.