ప్రధాని మోదీని కలిసినప్పుడు విద్యార్థులు తల వంచాలనడం విచాకరం : ఒవైసీ

Publish Date:Aug 9, 2026

Advertisement

 

ప్రధాని ఐఐటీ ఢిల్లీ పర్యటన ఘటనపై  అసదుద్దీన్ విమర్శలు..!

“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటీ ఢిల్లీ పర్య టన సందర్భంగా చోటు చేసుకున్నట్లు వచ్చిన నివేదికలపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ  అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ప్రధాన మంత్రి చేతుల మీదుగా పతకాలు స్వీకరించే సమయంలో విద్యార్థులను తలవంచమని, వేద మంత్రాల పఠనం సమయంలో నిలబడమని సూచించినట్లు వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు. ఈ అంశంపై మీడియాతో  ఒవైసీ మాట్లాడుతూ.. విద్యార్థులు, విద్యా సంస్థలు పాటించాల్సిన రాజ్యాంగ విలువలపై ప్రశ్నలు లేవనెత్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(H) ప్రతి పౌరుడిలో శాస్త్రీయ దృక్పథం, మానవ తావాదం, విచారణా స్ఫూర్తిని పెంపొందించా ల్సిన బాధ్యతను పేర్కొం టుందని గుర్తుచేశారు.

“శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన ఆర్టికల్ 51A(H)ను చెత్తబుట్టలో పడేశారు” అని ఒవైసీ వ్యాఖ్యానిం చారు.అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 28ను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ నిధులతో పూర్తిగా నిర్వహించే విద్యాసంస్థల్లో మత బోధనకు సంబంధించి రాజ్యాంగం స్పష్టమైన నిబంధనలు కలిగి ఉందని పేర్కొన్నారు. విద్యాసంస్థలు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేయా ల్సిన అవసరం ఉందన్నారు.“ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే జాతీయ ప్రయోజనం” అని విద్యార్థులు గుర్తుంచు కోవాలని ఒవైసీ సూచించారు. 

ప్రజాస్వామ్యంలో విద్యార్థులకు ప్రశ్నించే హక్కు, శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా స్వేచ్ఛ, రాజ్యాంగ విలువలు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఒక విద్యాసంస్థలో విద్యార్థు లను నిర్దిష్ట సూచనలు పాటించమని కోరడం ఈ విలువలకు అనుగుణంగా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. విద్యాసంస్థలు రాజకీయ, మతపరమైన ప్రభావాలకు అతీతంగా శాస్త్రీయ ఆలోచనలను ప్రోత్సహించే వాతావ రణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని ఒవైసీ అభిప్రాయపడ్డారు.

Prime Minister Modi, MP Asaduddin Owaisi, PM visit to IIT Delhi, MIM,   IIT Students

By
en-us Political News

  
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.