ఇదెక్కడి న్యాయం పెద్దయనా?

Publish Date:Nov 2, 2013

Advertisement

 

రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తనకున్న మిస్టర్ క్లీన్ ఇమేజ్‌ని పోగొట్టుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో తన విచక్షణని ఎంతమాత్రం ఉపయోగించుకుండా, సోనియాగాంధీ చెప్పినవాటికి తలుపుతూ ఆయన తెలుగువారి అభిమానాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు. ముజఫర్ నగర్‌లో జరిగిన అల్లర్ల విషయంలో రాహుల్ గాంధీ నోటికొచ్చినట్టు మట్లాడి అందరిచేతా తలంటు పోయించుకున్న విషయం తెలిసిందే. ఆ ముజఫర్ నగర్‌లోనే రెండు రోజుల క్రితం స్పల్ప ఘర్షణలు జరిగాయి. దేశంలో మరే సమస్యా లేనట్టు ప్రధాని మన్మోహన్ ఆ ఘర్షణల మీద వెంటనే స్పందించారు. ఆ స్పందన వెనుక బీజేపీని తక్కువ చేయాలనే ఉద్దేశమే ఉన్నట్టు కనిపించింది. ఘర్షణల మీద ప్రధాని స్పందిస్తూ, సమాజాన్ని కొంతమంది మతం, కులం, వర్గాలుగా విభజిస్తున్నారని వాపోయారు. పాపం పెద్దాయన బాగానే వాపోయారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ప్రాంతం పేరున విభజిస్తోంది. మరి దీనిమీద స్పందించడం మన్మోహన్ సింగ్ సాబ్‌కి తెలియదా? ఇదెక్కడి న్యాయం పెద్దాయనా?

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్..
మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
  బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.