ఘనత చాటుకుంటే సరిపోదు.. కళ్లకూ కనబడాలి!

Publish Date:May 1, 2023

Advertisement

స్వరాష్ట్రం సాధనతో పాటు ..తెలంగాణ పునర్నిర్మాణలంలోనూ పురోగమనం.. చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ అన్నట్లుగా సాగుతోంది. అభివృద్ధి, సంక్షేమం గురించి అధికార బీఆర్ఎస్ ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా.. అంతకు మించి రాష్ట్రంలో అవినీతి గురించిన విమర్శలు వినవస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధితో సమానంలో వైఫల్యాలూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం తెలంగాణ మోడల్ అంటూ చేసుకుంటున్న ప్రచారం.. విపక్షాల అవినీతి ఆరోపణల ముందు వెలవెలబోతోంది.

ముఖ్యంగా టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ, ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితపై ఆరోపణలు, ఈడీ, సీబీఐ విచారణల తరువాత కేసీఆర్ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారిందనడంలో సందేహం లేదు. అయితే పొరుగున ఉన్న ఏపీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత అభివృద్ధి, సంక్షేమం విషయంలో కచ్చితంగా మెరుగ్గా ఉందని చెప్పడానికి మాత్రం ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. అందుకే తెలంగాణ మోడల్ అంటూ  సొంత భుజాలను తడుము కోవడం కంటే ముందే తెలంగాణ మంత్రులు ఏపీలో అభివృద్ధి లేమి, అందని సంక్షేమం గురించి ముందుగా ప్రస్తావిస్తూ వస్తున్నారు.  ఇకపోతే తెలంగాణ సచివాలయ నిర్మాణం, ప్రారంభాన్ని మహోజ్వల ఘట్టంతో పోలుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, శ్రేణులు చేస్తున్న హడావుడి, ఆర్బాటం, సచివాలయంపై అక్కడ పని చేయాల్సిన ఉద్యోగులే పెదవి విరవడంతో తుస్సుమన్నట్లైంది.

ఉద్యోగులకు పని చేసుకోవడానికి అవసమైనంత విశాలంగా వివిధ శాఖలకు కేటాయించిన ప్రదేశం లేదని ఉద్యోగులు సచివాలయ ప్రారంభానికి ముందే అసంతృప్తి వ్యక్తం చేశారు.  వాస్తవానికి కేసీఆర్ ఏం చేసినా ఘనంగా చేస్తారు. ఆర్భాటంగా చేస్తారు. గోటితో పోయే దానికి గొడ్డలి ఉపయోగిస్తారు. అలాగే  కొత్త సచివాలయ నిర్మాణం విషయంలో అవసరానికి మించి ఆర్భాటం చేశారు. అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుందంటూ అడ్వర్టైజ్ మెంట్లు గుప్పించారు.  

నిర్మాణ సమయంలో వీలైనన్ని సార్లు సందర్శించి పర్యవేక్షించారు. అలా పర్యవేక్షించిన ప్రతి సారీ కొత్త కొత్త సూచనలు చేశారు.  మొత్తానికి  265 అడుగుల ఎత్తుతో 28 ఎకరాల్లో నిర్మించారు. మొత్తం 10,51,676 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం ఉంది. మొత్తం ఏడు అంతస్తులు నిర్మించగా.. ఒక్కో అంతస్తు 14 అడుగుల ఎత్తు ఉంటుంది. తొలి రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో మంత్రుల కార్యాలయాలు, ఇతర శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ కొత్త సచివాలయం నిర్మించినట్లు  కేసీఆర్ చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఒక్క వర్షానికే నీరు చేరడం, ఫిల్లర్ బీటలు వారడం, సచివాలయం వ్యయంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వకపోవడంతో  కేసీఆర్ చెబుతున్నంత హైప్ కొత్త సచివాలయానికి రావడం లేదు.  

ఇక అన్నిటికీ మించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం నాడు సచివాలయంలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు రేవంత్ సచివాలయానికి బయలు దేరగా ఆయనను పోలీసులు టెలిఫోన్ భవన్ వద్దే అడ్డుకున్నారు.   ఎంపీనైన తననే అడ్డుకుంటున్నారంటే ఇక సామాన్యులను అసలు సచివాలయం వైపు కన్నెత్తి చూడనిస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ సచివాలయానికి బయలుదేరడం, ఆయనను పోలీసులు నిలువరించడం అటుంచి.. ఏకంగా సచివాలయ విజిటర్స్ గేటునే ప్రారంభం జరిగిన మరుసటి రోజునే మూసి వేయడం విమర్శలకు తావిస్తోంది.    

By
en-us Political News

  
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.