విభజన...‘విడిది’

Publish Date:Dec 30, 2013

Advertisement

 

 

 

గతంలో శీతాకాల విడిదికి గాను హైదరాబాద్‌కు వచ్చిన ఏ రాష్ట్రపతికీ ఈ తరహా అనుభవం ఎదురై ఉండదు. దీనికి కారణం రాష్ట్రంలో నెలకొన్న విభజన పరిస్థితులే. గందరగోళంగా రాష్ట్ర పరిస్థితి రాష్ట్రపతి నిలయాన్ని కేంద్రంగా మార్చుకోవాలని చూస్తుండడంతో... విశ్రాంతి నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రణబ్‌ముఖర్జీ... ఫుల్‌ బిజీగా మారిపోయారు. పార్టీల వారీగా వచ్చేవారు కొందరు, వ్యక్తిగతంగా వచ్చేవారు మరికొందరు... గుట్టల కొద్దీ వినతిపత్రాలు, అర్జీల మీద అర్జీలు వచ్చి పడుతుంటే పాపం...ఏం చేయాలో తెలియక ఓపికగా అందర్నీ ఆహ్వానిస్తున్నారు. దీంతో నగరంలోని రాష్ట్రపతినిలయం ఎప్పుడూ లేనంత సందడిగా మారింది.

 

 

మామూలుగా అయితే ఢిల్లీ వెళ్లి, రాష్ట్రపతిని కలవడం అంటే అంత తేలికైన విషయం కాదు. పైగా అసలు ఆయన అపాయింట్‌మెంట్‌ దొరకడమే గగనం. ఎంతో వ్యయప్రయసలకు ఓర్చుకుని అక్కడి దాకా వెళ్లినా అక్కడ ఉండే బిజీ కారణంగా రాష్ట్రపతి ఇచ్చే సమయం ఏదో కొన్ని నిమిషాలకు మించి ఉండదు. వీటన్నింటిని బేరీజు వేసుకున్న పార్టీలు, వ్యక్తులు... విడిదిలో బస పూర్తయిపోయేలోగా... తమ పని చక్కబెట్టేసుకోవాలని ఆరాటపడుతున్నారు. నిజానికి విభజనకు సంబంధించినంత వరకూ ఇరు ప్రాంతాల నేతలు చేస్తున్న వాదనలు, వినిపిస్తున్న అంశాలు కొత్తవీ కావు... ఇప్పటిదాకా ప్రణబ్‌కు తెలియనివీ కావు. మరెందుకీ ఆరాటం అంటారా? అదేనండీ మైలేజీ.




నిజానికి తామే సమైక్యవాద ఛాంపియన్‌లం అని నిరూపించుకోవాలని తహతహలాడుతున్నవారు అందుకు దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోదలచుకోవడం లేదు. వారే ఈ మార్గం కనిపెట్టారు. అది మరెందరికో దారి చూపింది. ముక్కలు చెక్కలుగా విడిపోయిన సమైక్యవాదులు... ఒకరొకరుగా రాష్ట్రపతిని కలిసి వచ్చి, ఆ విషయాన్ని మీడియాకు వెళ్లడిస్తూ బోలెడంత మైలేజీ తెచ్చేసుకుంటుంటే... కంగారుపడిపోయిన ప్రత్యేకవాదులు కూడా అదే బాట పట్టారు. అందుకోసం అప్పటికప్పుడు ఉమ్మడిరాజధానిని రెండేళ్లు కుదించాలనే సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చి మరీ రాష్ట్రపతిని కలిసొచ్చారు. గతంలో పదేళ్ల ఉమ్మడికి ఒప్పుకున్న నాయకులు ఇప్పటికిప్పుడు రెండేళ్ల డిమాండ్‌ తేవడం విచిత్రమని విశ్లేషకులు అంటున్నారు. ఈ ‘వాదుల’ హోరు చూస్తున్న మరికొందరు వ్యక్తులు పలు రకాల సంస్థలు, సంఘాలు అప్పటికప్పుడు తమ డిమాండ్లను గుర్తు తెచ్చుకుని ఛలో రాష్ట్రపతి నిలయం అంటున్నారు. ఏదేమైనా... నేతల ప్రచార కండూతి కాస్త తగ్గితే ఆ మేరకు ఈ శీతాకాలవిడిది రాష్ట్రపతికి విశ్రాంతిని ఇస్తుంది.

 

By
en-us Political News

  
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.