ఏకగ్రీవం దిశగా రాష్టపతి ఎన్నిక .. సామ్నాసంకేతం ?

Publish Date:Jun 18, 2022

Advertisement

రాష్ట్ర పతి ఎన్నికను ప్రతిపక్ష పార్టీలు సీరియస్ గా తీసుకోవడం లేదా? అందుకే, ఉమ్మడి అభ్యర్ధిని నిలిపే విషయంలో ఏకాభిప్రాయానికి రాలేక పోతున్నాయా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. అది కూడా, ఇంకెవరి నుంచో కాదు, ప్రతిపక్ష కూటమిలో కీలక పాత్రను పోషిస్తున్న, బీజేపీ మాజీ మిత్ర పక్షం, మహారాష్ట్ర అధికార కూటమికి నేతృత్వం వహిస్తోన్న శివసేన పార్టీ, ఈ సందేహాన్ని వ్యక్త పరిచింది.  సందేహాన్ని వ్యక్త  పరచడమే కాదు, ఇలా అయితే ఎలా? రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్ట లేకపోతే.. వచ్చే ఎన్నికల్లో సమర్థుడైన ప్రధానమంత్రి అభ్యర్థిని ఎలా ఎంపిక చేస్తారని ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉందని హెచ్చరించింది.

శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’ ఎడిటోరియల్‌ పేజీలో ప్రచిరించిన వ్యాసంలో ప్రతిపక్షాల ఐక్యత పట్ల ప్రజల్లో విశ్వాసం కల్పించ  వలసిన అవసరం ఉందని, పేర్కొంది.  అంతే కాదు, కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు ప్రస్తావనకు వచ్చినా, ఆయన నో’ అన్న నేపధ్యంలో మమతా బెనర్జీ మహాత్మాగాంధీ మనవడు,  పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఫరుక్‌ అబ్దుల్లా పేర్లను ప్రతిపాదించారు.

అయితే ఈ పేర్ల  విషయంలో శివసేన పెదవి విరించింది. బీజేపీ అభ్యర్ధికి ఆ ఇద్దరిలో ఎవరూ గట్టి పోటీ ఇవ్వలేరని, కేవలం పోటీ చేశామంటే చేశామనేందుకు  మాత్రమే పనికొస్తారని  ‘సామ్నా’ సంపాదకీయ వ్యాసంలో పేర్కొంది. బీజేపేని దీటుగా ఎదుర్కొని గట్టిపోటీ ఇచ్చేందుకు బలమైన అభ్యర్థి అవసరం అంటూ ఉమ్మడి అభ్యర్ధి ఎంపిక  విషయంలో ప్రతిపక్షాల తీరును పరోక్షంగానే అయినా గట్టిగా  ఎండగట్టింది. అదేవిధంగా ఎన్డీయే అభ్యర్థిగా సమర్థుడైన వ్యక్తిని నిలబెట్టే అవకాశం ఉండకపోవచ్చని,  ప్రస్తుత రాష్ట్రపతి రాంమ్ నాథ్ కొవింద్ ఎంపిక సమయంలోనూ బీజేపీ ముందు ఇద్దరు ముగ్గురు  పేర్లను చర్చకు తెచ్చి చివరకు కొవింద్’ను ఏంక చేసిందని సామ్నా వ్యాసం పేర్కొంది.

ఇప్పుడు కూడా, ప్రస్తుతం వినిపిస్తున్న వారు కాకుండా ఇంకొకరని తెర మీదకు తెచ్చే అవకాసం ఉందని సామ్నా అభిప్రాయపడింది. అంటే, ప్రతిపక్షాలు బలమైన అభ్యర్ధిని నిలిపితే గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని తద్వారా బీజేపీ  దూకుడుకు కళ్ళెం వేయవచ్చనే అభిప్రాయం సామ్నా వ్యక్తపరిచింది. అయిత, ఎవరా  బలమైన అభ్యర్ధి, అనే  ప్రశ్నకు సామ్నా సమాధానం ఇవ్వలేదు.  రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ నిరాకరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ ప్రశ్నకు ఇప్పడు కాదు, ఆరు నెలల క్రితమే సమాధానాలు కనుగొని ఉండవలసింది అని నిష్టూరమడింది. అంతే కాకుండా, ఇంకొక  అడుగు ముందుకేసి, దీంతో ప్రతిపక్ష పార్టీల  చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందని  మరో రాయి విసిరింది. 

అయితే మరో రెండు రోజుల్లో, జూన్ 20,21 తేదీలలో  శరద్ పవార్ నాయకత్వంలో ముంబై ప్రతిపక్ష పార్టీల సమావేశం జరగనున్న సమయంలో శివసేన,  ఈ బాంబు ఎందుకు పేల్చింది? అదికూడా, శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాష్ట పతి ఎన్నిక ఏకగ్రీవం విషయంగా చర్చలు జరిపిన రోజునే సామ్నా సంపాదకీయ వ్యాసంలో  ప్రతిపక్షాల ఐక్యత పై అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాసం రావడం అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది. 

కాగా, రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు, ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపే బాధ్యతను బీజేపీ కేంద్ర మంత్రి  రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ  నేపధ్యంలోనే రాజ్ నాథ్ సింగ్, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేతో   గురువారం ఫోను ద్వారా  చర్చలు జరిపారు.  సో.. సామ్నా వ్యాసం రాష్ట్రపతి ఎన్నిక  ఏకగ్రీవానికి సంకేతామా? అంటే, అయినా కావచ్చని, నిజానికి కాంగ్రెస్, ఎన్సీపీ సహా చాలా వరకు పార్టీలు పోటీ కంటే ఏకగ్రీవం వైపే మొగ్గు చూపుతున్నాయని అంటున్నారు.

By
en-us Political News

  
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.