Publish Date:Jan 20, 2022
అది పీఆర్సీ కాదు.. రివర్స్ పీఆర్సీ.. పీఆర్సీ ప్రకటిస్తే జీతాలు పెరగాలి కానీ.. తగ్గడమేంటి? అదే కదా జగనన్న మాయం. కాదు కాదు మోసం. ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తక్కువిచ్చి.. హెచ్ఆర్ఏలో కోతేసి.. డీఏలతో లెక్కల గారడీ చేశారు. మొదట్లో జగనన్న జాదూను గుర్తించలేకపోయిన ఉద్యోగ సంఘాలు చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు జీవోలు వచ్చాక గానీ.. తామెంత మోస పోయామనేది.. జీతాలు ఎంత భారీగా తగ్గుతున్నాయనేది తెలిసొచ్చింది. ఇక అంతే.. తగ్గేదేలే అంటూ పోరాటానికి దిగారు. సమ్మె చేసేందుకు సై అన్నారు. ఏపీ వ్యాప్తంగా ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. జగనన్నకు ఉద్యోగుల సెగ తగిలేలా ఉద్యమిస్తున్నారు.
పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్లమీదికొచ్చాయి. పోలీసులు ఉపాధ్యాయ సంఘాల నాయకులను రాత్రి నుంచే అడ్డుకుంటున్నారు. కలెక్టరేట్ల ముట్టడికి అనుమతి లేదని నోటీసులిస్తూ చాలా చోట్ల గృహనిర్బంధాలు చేశారు. అన్ని కలెక్టరేట్ల దగ్గర భారీగా పోలీసుల మోహరించారు.
కడప జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి సిద్ధమైన ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిని గృహనిర్బంధం చేశారు. ప్రొద్దుటూరు నుంచి కడప కలెక్టరేట్‌కు వెళుతున్న ఉపాధ్యాయులను కొత్తపల్లె చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. గుంటూరు కలెక్టరేట్ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు ముందస్తు నోటీసులిస్తున్నారు. పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలు గృహనిర్బంధంలో ఉన్నారు.
నెల్లూరు జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల నాయకులను పలువురిని అరెస్టు చేయడంపై వెంకటగిరి పోలీస్ స్టేషన్ దగ్గర ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఆత్మకూరు, సంగం చెక్ పోస్టుల దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేశారు.
చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిలో ఉద్యోగ సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఒంగోలు కలెక్టరేట్ వద్దకు భారీగా చేరుకున్న ఉపాధ్యాయ సంఘ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖలో ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శిను గృహనిర్బంధం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్టీయూ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prc-fight-in-ap-39-130438.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.