మొత్తం ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికల పోలింగ్ మంగళవారం (నవంబర్4) పోలింగ్ జరగనుంది. అగ్రరాజ్యంలో దాదాపు 24.4కోట్ల మంది ఓటర్లలో ముందస్తు ఓటింగ్ ద్వారా 7.5 కోట్ల మంది తమ ఓటు హక్కు ఇప్పటికే వినియోగించేసుకున్నారు. ఇక చివరి వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ ల ప్రచారానికి సోమవారం(నవంబర్ 3)తో ముగుస్తుంది.
ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై నిర్వహించిన పలు సర్వేలు.. గెలుపు ఎవరిదన్నది ఇతమిథ్ధంగా తేల్చలేకపోయాయి కానీ పోరు హోరాహోరీగా ఉంటుందన్న స్పష్టత ఇచ్చాయి. ఇవాళ రాత్రితో వారి ప్రచారం ముగియనుంది. ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలను బట్టి ఇరువురి మధ్య హోరాహోరీ పోరు తప్పదని తేలింది. మరీ ముఖ్యంగా ఎన్నికలలో స్వింగ్ స్టేట్స్‌లో కమలాహారిస్, ట్రంప్ లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయని దాదాపు అన్ని సర్వేలూ తేల్చేశాయి. ఈ రాష్ట్రాల్లో అక్టోబర్ 24 నుంచి నవంబర్ 2 వరకు ది న్యూయార్క్ టైమ్స్- సర్వే నిర్వహిం చింది. ఇందులో విస్కాన్సిన్, నార్త్ కరోలినా, నెవెడాలో కమలకు మద్దతు ఉంటే.. అరిజోనాలో ట్రంప్ వైపు ఓట్లరు మొగ్గచూపుతున్నట్లు తేలింది. అలాగే పెన్సిల్వేయా, జార్జియా, మిషిగన్‌లో ఇరువురు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు దిన్యూయార్క్ టైమ్స్ ఒపీనియన్ పోల్ వెల్లడించింది.
ఇలా ఉండగా అమెరికా ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ విజయాన్ని కాంక్షిస్తూ ఇండియాలో పూజలు జరుగుతున్నాయి. ఇందులో వింతేమీ లేదు. కమలా హారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడంతో భారత్ లో ఆమె విజయాన్ని కోరుకునే వారి సంఖ్య అధికంగా ఉంది. మరీ ముఖ్యంగా తమిళనాడులోని తులసేంద్రపురం అనే గ్రామంలో కమలా హారిస్ విజయం కోసం పూజలు నిర్వహించడమే కాదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలో ఇక్కడి ప్రజలు కూడా ఓట్లు వేస్తున్నారా అన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచార సంరంభం కనిపిస్తోంది. గ్రామం అంతటా కమలా హారిస్ కు మద్దతుగా పోస్టర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు వెలిశాయి.
అందుకు కారణం లేకపోలేదు. కమలా హారిస్ తల్లి డాక్టర్ శ్యామల స్వగ్రామం తులసేంద్ర పురం. ఆ ఊరి జనం కమలాహారిస్ ను తమ ఇంటి ఆడబడుచుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆమెరికాలో పుట్టిపెరిగినా కమలా హారిస్ తన అమ్మమ్మ గారి ఊరైన తులసేంద్రపురం గ్రామానికి పలుమార్లు వచ్చి వెళ్లారు. అలా ఆ గ్రామస్తులకు కమలాహారిస్ పట్ల అభిమానం ఏర్పడింది. దీంతో కమలా హారిస్ విజయాన్ని కాంక్షిస్తూ వారు పూజలు చేస్తున్నారు. గ్రామం అంతటా ఆమె పోస్టర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి హంగామా చేస్తున్నారు. ఎన్నికలలో ఆమె విజయం సాధిస్తే పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడానికి సమాయత్తం అవుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prayers-in-india-for-kamalaharis-victory-39-187825.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది