కాంగ్రెస్ గూటికి ప్రవీణ్ ప్రకాష్.!

Publish Date:Aug 21, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, ఐఏఎస్ వ్యవస్థలోనూ అత్యంత ప్రభావమంతమైన అధికారిగా గుర్తింపు పొందిన 1994 బ్యాచ్ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ జగన్ హయాంలో వ్యవహరించిన తీరు కారణంగా ప్రతిష్ఠను మసకబార్చుకున్నారు. చివరికి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. జగన్ హయాంలో తన పరిధులను మరిచి వ్యవహరించిన ఆయన తీరా వైసీపీ 2024 ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకు అధికారం కోల్పోయిన తరువాత.. తప్పులను గ్రహించి.. ఆ తప్పులకు శిక్ష తప్పదన్న భయంతో వీఆర్ఎస్ తీసుకున్నారు.  

సెప్టెంబర్ 30, 2024న ఆయన ఇలా రాజీనామా చేయగానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలా  ఆమోదించేసింది. అప్పుడు గానీ ఆయనకు తాను చేసినది తొందరపాటు చర్య అని గ్రహింపునకు రాలేదు. రాజీనామాను వెనక్కు తీసుకుని తిరిగి సర్వీసులో చేరుదామని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చేసేదేమీ లేక ఆయన తన స్వరాష్ట్రమైన యూపీకి చేరుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.  

 ఏపీలో   2019 నుండి 2021 వరకు ప్రవీణ్ ప్రకాష్  అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన ముఖ్యమంత్రి సీఎంవోలో  క్రియాశీల  అధికారిగా, ప్రభుత్వ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన  మోస్ట్ పవర్ ఫుల్ బ్యూరోక్రాట్‌గా పేరొందారు. జగన్‌ హయంలో ఆయన ఓ సమర్ధుడైన ఐఏఎస్ అధికారిగా కంటే జగన్‌కు, వైసీపీ నమ్మకస్తుడైన ఓ పొలిటికల్ అసిస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆయన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో వ్యవహరించిన తీరుతో తీవ్ర విమర్శల పాలయ్యారు.   ఆ తరువాత వారికి క్షమాపణ చెప్పారు.

ఇలా ఒకటనేంటి ఆయన తన చర్యలతో చేష్టలతో బోలెడంత అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో  వైసీపీ ప్రభుత్వం దిగిపోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రవీణ్ ప్రకాష్ కు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. దాదాపు మూడు నెలలు వేచి చూసి ప్రవీణ్ ప్రకాష్ చేసిన రాజీనామాను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆమోదించింది.  అటువంటి ప్రవీణ్ ప్రకాష్ తాజాగా కాంగ్రెస్ గూటికి చేరి ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టారు.  

Praveen Prakash join Congress, Ex IAS Praveen Prakash, Andhra Pradesh IAS VRS, UP Congress Politics, contravarsies, Ap Politics  

By
en-us Political News

  
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పక్షం హవా నడుస్తుంది. అయితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత పులివెందుల విషయంలో మాత్రం మిగిలిన ప్రాంతాలలోలా  అధికార పార్టీ హవా అని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు. అందుకే అధికార తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పులివెందులలో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. 
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (ముఖ్యంగా పట్టణ, నగర పాలక సంస్థల) చుట్టూ తిరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.
అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.