పీకే.. బీహార్ లో కింగ్ మేకరేనా?

Publish Date:Sep 16, 2025

Advertisement

ఒకప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్త అయి ఉండాలన్న అభిప్రాయం ఉండేది. 2014 ఎన్నికలలో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరడానికైనా, 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నా.. అలాగే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వరుసగా మూడో సారి అధికార పగ్గాలను అందుకున్నారన్నా.. అందుకు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు.

అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు సొంతంగా జన సురాజ్ పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని బీహార్ లో తిరుగుతున్నారునుకోండి అది వేరే సంగతి.  అయితే ఆయన ఇప్పుడు త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తన సొంత పార్టీ జనసురాజ్ కు తాను తన వ్యూహాలు అమలు చేయాల్సి ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల చివరిలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి.  అక్కడ పోరు హోరా హోరీ అన్న అంచనాలు ఉన్నాయి. ఎంత హోరాహోరీగా ఉన్నా ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ కు ఎడ్జ్ ఉందని సర్వేలు చెబుతున్నాయి. 

ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఆర్డేజీ, ఎల్జీపీ, ఆప్ స‌హా వామ‌ప‌క్షాలు, బీజేపీ నేతృ త్వంలోని ఎన్డీయే కూటమి   తలపడుతున్నాయి. కానీ ఎన్నికల వ్యూహకర్త, జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ మాత్రం తాను ఎవరి పక్షమూ కాదని చెబుతున్నారు. తాను ప్రజాపక్షమనీ, ఎన్నికల బరిలో ఒంటరిగానే దిగుతున్నాననీ చెబుతున్నారు.  అదే ఇప్పుడు ఈ ఎన్నికలలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న మహాఘట్ బంధన్, ఎన్డీయే శిబిరాల్లో ఆందోళనకు కారణమౌతోంది.

పీకేకి, ఆయన పార్టీకి యువత, విద్యార్థులలో మంచి గుర్తింపు ఉంది. ఆయన ఒంటరిగా బరిలోకి దిగితే విజయం మాట ఎలా ఉన్నా.. మహాఘట్ బంధన్, ఎన్డీయేల ఓట్లను భారీగా చీల్చే అవకాశాలున్నాయని తాజాగా ఓ సర్వే పేర్కొంది. బీహార్ ఎన్నికలలో పీకే నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ తక్కువలో తక్కువ 8.3 శాతం ఓట్లు సాధిస్తుందన్నది ఆ సర్వే సారాంశం. అంటే బీహార్ లో అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా పీకే ప్రాధాన్యత, ప్రాముఖ్యత చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట. సపోజ్ ఫర్ సపోజ్ బీహార్ ఎన్నికలలో ఏ పార్టీ అధికారానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోతే.. పీకే  కింగ్ మేకర్ అవుతారన్న మాట. కొంచం ఇంచుమించుగా తాజా సర్వే ఆ విషయాన్నే చెప్పింది. 

ఇక సర్వేను పక్కన పెట్టి బీహార్ ఎన్నికల విషయానికి వస్తే.. ఈ సారి ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత చాలా చాలా గట్టిగా పని చేస్తుందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా నితీష్ కుమార్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కూడా ఆ ప్రజా వ్యతిరేకతపైనే గంపెడాశలు పెట్టుకుంది. అయితే పీకే ఒంటరి పోరు పేరుతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశలు మెండుగా ఉన్నాయంటున్నారు.  చూడాలి మరి పీకే ఒంటరి పోరు ఏ కూటమి కొంప ముంచుతుందో? 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.