పోలీస్ బాస్ సజ్జనార్‌కు పదోన్నతి.. నెట్టింట వెల్లువెత్తిన అభినందనలు

Publish Date:Apr 24, 2026

Advertisement

తెలంగాణ పోలీసు శాఖలో తాజాగా చేపట్టిన ఉన్నతాధికారుల పదోన్నతులు   చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ హోదా లభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా సామాన్య ప్రజలు ఈ పదోన్నతి పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. సాధారణంగా  అధికారులు పదోన్నతులు..సంబంధిత శాఖలో చర్చకే పరిమితమౌతాయి. అయితే.. హైదరాబాద్ సీపీ  సజ్జనార్  పదోన్నతి రాగానే.. మాత్రం నెట్టింట ఆయనకు అభినందనలు తెలుపుతూ పోస్టులు వెల్లువెత్తాయి. అలాగే సామాన్య ప్రజలు కూడా ఆయనకు ప్రమోషన్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభిమానాన్ని చాటుకున్నారు.  

తెలంగాణ ప్రభుత్వం 1995, 1996 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  ఈ ఆరుగురిలో హైదరాబాద్ కమిషనర్‌  సజ్జనార్ ఒకరు. ఆయన డీజీపీ ర్యాంకులో  హైదరాబాద్ సీపీ కొనసాగుతారు. కేవలం తెలంగాణ నుంచే కాకుండా, ఆయన స్వరాష్ట్రం కర్ణాటకతో పాటు దేశవిదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈ సందర్భంగా ఆయనను అభినందనల్లో ముంచెత్తుతున్నారు.  తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు పోలీసు అధికారులకు పదోన్నతి కల్పిస్తే.. వారిలో ఒక్క సజ్జనార్ ప్రమోషన్ పట్ల మాత్రమే సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతుండటం ప్రత్యేకత, ప్రాధాన్యత సంతరించుకుంది.  

సజ్జనార్‌కు ప్రజల్లో ఇంతటి ఆదరణ ఉండటానికి ఆయన అనుసరిస్తున్న పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ సీపీగానే కాదు..   గతంలో  ఆయన పని చేసిన ప్రతి చోటా.. సజ్జనార్  ప్రజలకు చేరువగా ఉండటానికే ప్రాధాన్యత ఇచ్చారు. బాధితులకు భరోసా ఇస్తూ, అండగా నిలిచేవారు.  ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రత విషయంలో ఆయన తీసుకునే కఠిన నిర్ణయాలు ప్రజల మనసు గెలుచుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.  

అంతే కాకుండా  సోషల్ మీడియా వేదికగా ప్రజలకు నిరంతరం టచ్‌లో ఉంటారు. సైబర్ నేరాలు, మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆయనది ప్రత్యేక శైలి.  అదే సజ్జనార్ కు ప్రజలలో గుర్తింపును, వారి హృదయాలలో స్థానాన్ని కల్పించింది.  

గతంలో కూడా సజ్జనార్ పలు కీలక బాధ్యతలు నిర్వర్తించి విజయవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడని ఆయన వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి సముచితమైన పదోన్నతి కల్పించడంపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. కేవలం అధికారులే కాకుండా సామాన్యులు కూడా సజ్జనార్ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నారు.

ప్రస్తుతం డీజీపీ హోదా పొందిన తర్వాత సజ్జనార్ తన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. నగరంలో పెరుగుతున్న నేరాలను అరికట్టడం, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలపై ఆయన తనదైన ముద్ర వేస్తారని నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక అధికారి పట్ల ప్రజలకు ఉండే నమ్మకం, గౌరవం ఆ అధికారి సాధించిన అతిపెద్ద విజయమని ఈ అభినందనల వెల్లువ చూస్తుంటే స్పష్టమవుతోంది. భవిష్యత్తులో ఆయన మరిన్ని కీలక బాధ్యతలు స్వీకరించి పోలీసు వ్యవస్థకు మరింత వన్నె తీసుకురావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

By
en-us Political News

  
పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ముందుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ భావోద్వేగపూర్వక సందేశం ఇచ్చారు.
ఇద్దరు బాలురు ఫోన్ చూస్తూ ఆడుకుంటుండగా వారి మధ్య వివాదం జరిగింది.
క్యారియర్ ఎండీ సుందర్ నారాయణన్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ స్మగ్లింగ్‌పై కట్టుదిట్టమైన నిఘా ఫలితంగా వరుసగా రెండు భారీ పట్టివేతలు చోటుచేసుకున్నాయి.
రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి .సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు
ట్రంప్ హాజరైన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది.
విమాన ఫ్యూయల్ ధరలు విపరీతంగా పెరగడంతో భారత విమానయాన సంస్థలు నిర్వహణా భారంతో చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాయి.
సీఎం చంద్రబాబు విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసిందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పు చోటుచేసుకుంది.
ఇండోనేషియా రాజధాని జాకర్తా శివార్లలో సోమవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
ముందుగా ఇరాక్ పార్లమెంటరీ కూటమి కోఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ మాజీ ప్రధాని నూరి అల్ మాలికిని ఆ పదవిలో కూర్చోబెట్టాలని భావించింది. అయితే, మాలికికి ఇరాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.