ఫవన్‌ను.. ఫ్రకాష్‌రాజ్ ఫొగిడారా? తిట్టారా?

Publish Date:Nov 28, 2020

Advertisement

కన్నడిగుడయినా, విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ అచ్చ తెలుగులో ఊసరవెల్లి పదాన్ని బాగానే వాడారు. ఇంతకూ ఆయన ఆ పదప్రయోగం చేసింది ఎవరిపైనో తెలుసా? జనసేనాధిపతి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాడికిందపడేసిన మన పవన్‌కల్యాణ్ గురించి! అవునా ప్రకాష్‌రాజ్ మన జనసేనాని గురించి అంతేసిమాటలన్నారా అని వెంటనే ఉడుక్కోకండి. కొద్దిగా పొడిగే ప్రయత్నం కూడా చేశారండీ!

ఒక నాయకుడయి ఉండీ, ఆయనకో పార్టీకూడా ఉండీ, మరో పార్టీకి మద్దతునివ్వడం తనకు నచ్చలేదని కూడా చెప్పారు. అంటే ఆ లెక్కన కల్యాణ్‌బాబును నాయకుడిగా ప్రకాష్‌రాజ్ గుర్తించినందుకు, అన్నదమ్ములిద్దరితోపాటు, జనసైనికులు ఆయనకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడం, తనను నిరుత్సాహపరిచిందని కూడా మనసులో మాట చెప్పారు. అంటే.. జనసైనికుల లెక్క ప్రకారం.. ప్రకాష్‌రాజ్, పవనన్నయ్యను పొగిడినట్లుగానే భావించాలి.

గత ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం ఎంతో తెలిసి కూడా, పవన్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ప్రకాష్‌రాజ్‌కు సుతరామూ నచ్చలేదట. ఏం చేస్తాం? పీత కష్టాలు పీతవి. పవన్ కష్టాలు పవన్‌బాబువి మరి! అప్పటికీ రెండురోజులు ఢిల్లీలో అంతచలిలో కూడా, నద్దా గారి దర్శనభాగ్యం కోసం ఎదురుచూస్తే, రెండోరోజు ఆ భాగ్యం కలిగింది. ఆ భేటీలో పవన్ విశ్వరూపం ప్రదర్శించారని జనసైనికుల కథనం.

ఏపీలో బీజీపీ బలం ‘పాయింట్ ఎయిట’న్న విషయాన్ని పవన్‌కు, ప్రకాష్‌రాజ్జ్ నొక్కివక్కాణించి మరీ గుర్తుచేయడమే ఏమీ బాగోలేదు. సరే.. పవన్‌కూ వేరే దిక్కులేదు. ఇప్పటికే అన్ని పార్టీలతో దోస్తానా అయిపోయింది. ఇక మిగిలింది బీజీపీనే. ఈ వయసులో ఆయన మాత్రం ఇంకా ఎన్నిపార్టీల చుట్టూ తిరుగుతారు చెప్పండి? అమరావతి, గ్రేటర్ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక యవ్వారంలో, ‘కమలం’ తనను ‘పులుసులోముక్క’ను చేసి ఆడిస్తున్నా.. చేగువేరా టైపులో తిరగబడకుండా, చేష్టలుడిగి చూడాల్సిన దుస్థితిపై ఎవరికీ చెప్పుకోలేని దైన్యం.

అసలింతకూ ప్రకాష్‌రాజ్ బాధేమిటో అర్ధం కావడం లేదు. మా పవన్ ఎవరికి సపోర్టు చేస్తే ఆయనకెందుకు? గ్రేటర్ ఎన్నిక ల్లో పోటీ చేయాలని ఏదో తెలియక ఆవేశపడ్డారనుకోండి. తొందపడి ముందే కూసినట్లు, అభ్యర్ధుల పేర్లు కూడా ఎంపిక చేసే హడావిడి కూడా చేశారనుకోండి. అయినా జనసేనతో పొత్తు జాన్తానై అని, కమలదళపతి సంజయ్ చెప్పిన తర్వాత, సరే మీ ఇష్టమని గౌరవప్రదంగా చేతులెత్తేశారే అనుకోండి. అంతమాత్రాన.. ఒకప్పుడు టీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారు వచ్చేందుకు పోరాడిన, మా ‘ఆంధ్రా చేగువేరా’ను ప్రకాష్‌రాజ్ అంత అవమానిస్తారా? అయినా.. గ్రేటర్‌లో పోటీ చేయనందుకు పవనన్నయ్య ఫీలవ్వాలి గానీ, మధ్యలో ఈ ప్రకాష్‌రాజ్‌కెందుకు? అని జనసైనికులు తెగ ఫీలవుతున్నారట. పోనీలెండి.. పాపం పవన్ ప్రతాపం తెలియక, ఏదేదో మాట్లాడిన ప్రకాష్‌రాజ్‌ను క్షమించేద్దాం. ఓకేనా?

-మార్తి సుబ్రహ్మణ్యం

 

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.