ఇక ప్రజాభవన్ గా ప్రగతి భవన్.. ప్రతి రోజూ ప్రజాదర్భార్!

Publish Date:Dec 6, 2023

Advertisement

ప్రగతి భవన్ అదో దుర్భేధ్యమైన కోట. ఇంత కాలం కేసీఆర్ క్యాంపు కార్యాలయం, అధికారిక నివాసం అయిన ప్రగతి భవన్ ను కేసీఆర్ మాజీ కాగానే ఖాళీ చేసేశారు. గత తొమ్మిదేళ్లుగా ప్రగతి భవన్ ప్రజలకు ప్రవేశించడానికి కూడా అవకాశం లేని నిషేధిత భవన్. ప్రజల దాకా ఎందుకు బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, చివరాఖరికి మంత్రులకు కూడా అనుమతి లేనిదే ప్రగతి భవన్ గడీలు దాటి లోపలకు అడుగుపెట్టే అవకాశం లేదు. అదో దొరల కోట.  

కేసీఆర్ తొలిసారిగా విజయం సాధించి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన క్షణం నుంచే ప్రగతి భవన్ ప్రజలకు అందుబాటులోకి లేకుండా పోయింది. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రగతి భవనే సీఎం అధికారిక నివాసం. అప్పుడు ప్రతి రోజూ ప్రజా దర్బార్ లు జరిగేవి. సీఎం రోజూ వేల మందితో  ములాఖత్ అయ్యేవారు. కానీ రాష్ట్ర విభజన తరువాత, కేసీఆర్ సీఎం అయిన తరువాత ప్రజలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ప్రజలా వైపుకు చూసేందుకు కూడా భయపడేలా రోడ్డును ఆక్రమించి మరీ ఐరెన్ ఫెన్సింగ్ నిర్మించేశారు.  జనాలకు అది ఎవరికీ ప్రవేశం లేని ఓ కోటలా మార్చేశారు. యాక్చువల్ ప్రగతి భవన్ కువెళ్లడానికి మూడు వందల మీటర్ల ముందు నుంచే పోలీసు బందోబస్తు. 

కేసీఆర్ ప్రగతి భవన్ పాలనపై గత తొమ్మిదేళ్లలోనూ పలు విమర్శలు వెల్లువెత్తాయి.  ఆ కోటలాంటి ఏర్పాట్లు చూసిన వారెవరికైనా మనం ఉన్నది ప్రజా స్వామ్యంలోనా, రాజరిక వ్యవస్థలోనా అన్న అనుమాలు వ్యక్తం అయ్యేవంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఇక ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేసీఆర్ ప్రగతి భవన్ టు ఫామ్ హౌస్ ప్రయాణం అతి తరచుగా ఉండేది. అది కూడా రద్దీ పెద్దగా లేని సమయంలో కాకుండా సరిగ్గా అత్యంత బిజీగా ఉండే సమయాన్ని ఎంచుకుని ఆయన తన ఫామ్ హౌస్ కు రాకపోకలు సాగించే వారు. దీంతో పంజాగుట్ట నుంచి ప్యాట్నీ వరకూ, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి అల్వాల్ రైతు బజారు వరకూ ట్రాఫిక్ ను నిలిపివేసి పోలీసులు నానా హడావుడీ చేసే వారు. ఇకపై అలాంటి సమస్యలకు తావే ఉండదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు  ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఎన్నికల ప్రచారంలోనే ఈ విషయాన్ని విస్పష్టంగా చెప్పింది. అలాగే  ఆ ప్రజా భవన్ లో నిత్యం ప్రజాదర్బార్ నిర్వహిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.  ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. గురువారం (డిసెంబర్ 7) రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చే క్రమంలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇరెన్ ఫెన్సింగ్ ను తొలగించడం తో పాటు.. ప్రగతి భవన్ ముందున్న గడీలను కూడా కూల్చివేయనున్నట్లు చెబుతున్నారు. ప్రజలకు ప్రజాభవన్ ను సులువుగా యాక్సెస్ చేయడంలో భాగంగానే ఈ మార్పులు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.   

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.