లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. విషయమేంటంటే?

Publish Date:Feb 4, 2025

Advertisement

ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ తో జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. కేంద్ర ఐటీ శాఖ మంతరి అశ్విని వైష్ణవ్ ను కలిసేందుకు ఢిల్తీ వెల్లిన లోకేష్ తో భేటీ అయ్యేందుకు ప్రశాంత్ కిషోర్ వచ్చారు. ఎన్నికల వ్యూహకర్తగా మొదలకై సొంత పార్టీ పెట్టుకుని బీహార్ రాజకీయాలకే పరిమితమైన ప్రశాంత్ కిషోర్ లోకేష్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిరువురి మధ్యా ఏయే అంశాలపై చర్చ జరిగిందన్నది తెలియరాలేదు.

అయినా పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించడం మానేసి, ఐ ప్యాక్ నుంచి పూర్తిగా వైదొలగిన ప్రశాంత్ కిషోర్ పనిగట్టుకుని మరీ లోకేష్ తో భేటీ అవ్వడంపై పలు విధాలుగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన రాబిన్ శర్మ ప్రశాంత్ కిషోర్ శిష్యుడే. ఆయన ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో పార్టీ పటిష్టత కోసం రాబిన్ శర్మ పని చేస్తున్నారని అంటున్నారు. దానిపై క్లారిటీ లేదు. ఇప్పుడు లోకేష్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ అవ్వడం వెనుక కూడా తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకువెళ్లే వ్యూహాలపైనే చర్చ జరిగి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. 

కాగా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీహార్ లో తన పార్టీ జన జనసురాజ్ ను ఎన్నికలలో గెలిపించుకోవడంపైనే పూర్తిగా దృష్టి పెట్టారు.   బీహార్ లో  ఉద్యోగ నియామకాల విషయంలో జరిగిన అవకతవకలపై  విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఇటీవల ఆమరణదీక్షచేసి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన బీహార్ లో గేమ్ చేంజర్ గా మారే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇక పోతే ప్రశాంత్ కిషోర్ లోకేష్ తో భేటీ, వారి మధ్య ఏయే అంశాలపై చర్చ జరిగిందన్న విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. 

అయితే రాజకీయ వ్యూహాల్లో నిష్ణాతుడిగాదేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ పనిగ్ట్టుకుని మరీ లోకేష్ తో భీటీ అవ్వడంపై మాత్రం రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఢిల్లీలోని ఏపీ సీఎం అధికారిక నివాసంలో బస చేసిన లోకేష్ ను కలిసేందుకే ప్రశాంత్ కిషోర్ అక్కడకు వచ్చారు. వీరిరువురి మధ్యా భేటీ ముందుగా నిర్ణయించిన మేరకే జరిగిందని అర్ధమౌతోంది.  

గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పారు ప్రశాంత్ కిశోర్. అయన అంచనా వేసినట్లే ఆ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి కనీవినీ ఎరుగని రీతిలో ఘన విజయం సాధించింది. వైసీపీ కనీపం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమై ఘోరాతి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.  వాస్తవానికి అప్పుడు ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన శిష్యుడు రాబిన్ శర్మ తెలుగుదేశం కోసం పని చేశారు. అయినా అప్పట్లో ప్రశాంత్ కిశోర్ తెలుగుదేశం కూటమి విజయం తథ్యమని చెప్పారు.  అప్పటి నుంచీ ప్రశాంత్ కిశోర్ కు లోకేష్, చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఆ క్రమంలోనే లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉండగా ప్రశాంత్ కిశోర్ ఆయనతో భేటీ అయ్యారని చెబుతున్నారు.  

By
en-us Political News

  
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.