పవర్ హాలిడే కాదు.. జగన్ కే హాలిడే..!

Publish Date:Apr 8, 2022

Advertisement

అంటే అన్నారంటారు కానీ.. అనరా మరి..! ‘అరటి పండు తొక్క.. జగనన్న బొక్క’ అని. లైట్లు, ఫ్యాన్లు వేయొద్దు.. లాంతర్లు వెలిగించండి అని.. పెంచిన విద్యుత్ చార్జీలు ఒక ఎత్తయితే.. రోజుకు నాలుగైదు గంటల పాటు కరెంట్ సరఫరా ఉండని దుస్థితి ఏపీలో నెలకొంది. దాంతో పాటు తాజాగా పవర్ హాలిడే అట. గురువారం అర్ధరాత్రి నుంచీ ఏపీలోని పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించింది వైసీపీ సర్కార్. వారాంతపు సెలవులతో పాటు వారంలో మరో రోజు పవర్ హాలిడే ప్రకటించాలని జగన్ రెడ్డి సర్కార్ అర్ధరాత్రి ఆదేశాలిచ్చింది. నిరంతరాయంగా పనిచేసే పరిశ్రమలైతే.. అవి వాడుకునే విద్యుత్ లో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలనే నిబంధన పెట్టింది.

ఏపీ ఖజానాలోని నిధులన్నీ విచక్షణా లేకుండా.. ఇష్టం వచ్చినట్లు వాడేసి, ఆనక అప్పుల మీద అప్పులు చేసి, అవి కూడా రాష్ట్ర ఆదాయానికి మించి చేసేసి, ఆపైన బాండ్లను అయినకాడికి కుదవపెట్టేసి, ప్రభుత్వ విభాగాల ఖాతాల్లోని డబ్బులన్నీ తీసేసి, అతి చిన్న గ్రామపంచాయతీల్లోని నిధులూ లాగేసి, సర్పంచ్ ల చేతుల్లో చిప్పలు పెట్టి అడుక్కునేలా చేసిన వైసీపీ సర్కార్ గొప్పల చిట్టా గురించి చెప్పుకునేందుకు ఇంతకన్నా సంగతులేమి ఉంటాయి? అని ఏపీ ప్రజలు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవన్నీ చాలవన్నట్లు.. ఇప్పుడు తాజాగా పరిశ్రమలపైనా వైసీపీ సర్కార్ క్షుద్ర దృష్టి పడింది. ఇప్పటికే విద్యుత్ కోతల కారణంగా ఉత్పత్తి తగ్గిపోయి విలవిల్లాడుతున్న పరిశ్రమలపై పవర్ హాలిడే బండను కూడా జగన్ సర్కార్ వేయడంపై సర్వత్రా ఆందోళన, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. అసలే ఉత్తత్తులు తగ్గిపోయి, ఆర్థికంగా నష్టపోయి, కార్మికులు, సిబ్బందికి నెలవారీ జీతాలు ఇచ్చే దారి కనిపించక యజమానులు అల్లాడిపోతున్నారు. తాము నెలంతా కష్టపడి చేసిన పనికి సమయానికి జీతాలు రాక ఇక్కట్లు పడుతున్న కార్మికులు, సిబ్బంది నకనకలాడిపోతున్నారు. ఇప్పటికే అటు పరిశ్రమలు, ఇటు కార్మికులు, సిబ్బంది ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటుంటే.. మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా ఇప్పుడే పవర్ హాలిడే అమలు చేయాలంటూ జగన్ రెడ్డి సర్కార్ పిడుగు లాంటి ఆదేశాలివ్వడమేంటనే ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా వెల్లడవుతోంది.

వైసీపీ సర్కార్ చేసిన తాజా ఆదేశాల కారణంగా ఏపీలో పారిశ్రామిక ఉత్తపత్తిపై తీవ్రమైన దెబ్బ పడుతుందని పలువురి నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. 2014కు ముందు అంటే ఎనిమిదేళ్ల నాటి పరిస్థితులు మళ్లీ ఏపీలో పునరావృతం అవుతున్నాయనే ఆవేదన జనంలో కలుగుతోంది. పరిశ్రమలకు పవర్ హాలిడే అంటే కార్మికుల ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున దెబ్బతీసేందుకు వైసీపీ సర్కార్ తెగబడిందనే విమర్శలు వస్తున్నాయి. ఏపీకి అసలే పెట్టుబడులు రావడం లేదు. కొత్త పరిశ్రమల ఊసే లేదు. ఉన్న పరిశ్రమలు కూడా ప్రస్తుతం వాడుకుంటున్న విద్యుత్ లో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలని చెప్పడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏపీ సర్కార్ నిర్ణయంతో కార్మికులు రోడ్డున పడే దుస్థితి వస్తుందనే కనీస పరిజ్ఞానం కూడా లేదా? అంటున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే రెండేళ్లు ఏపీలోని పారిశ్రామిక రంగం ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కార్మికులు కూడా ఉపాధి కోల్పోయారు. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా పరిస్థితులు చక్కబడుతున్నాయనుకుంటుంటే.. జగన్ సర్కార్ పవర్ హాలిడే పేరుతో పిడుగు వేయడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి.

ఒక పక్కన రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. మరో పక్కన విద్యుత్ సరఫరా చేసే సంస్థలకు బకాయిలు చెల్లించకుండా.. సర్కార్ వాటి చేత వాతలు పెట్టించుకుంటోంది. మరో పక్కన బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తోంది. దీంతో సర్కార్ ఖజానాకు మరింత బొక్క పడుతోంది. నెత్తి మీదకు ఆర్థిక భారాన్ని మరింత పెంచుకున్న వైసీపీ సర్కార్ ఇక చేతులెత్తేసి.. పవర్ హాలిడే ప్రకటించడాన్ని అనేక మంది తూర్పారపడుతున్నారు. పవర్ హాలిడే ప్రకటించిన జగన్ సర్కార్ కే  సమయం చిక్కితే హాలిడే ప్రకటించాలని ఏపీ జనం నిర్ణయించుకున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వస్తున్నాయి. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పినట్లు హాలిడే సీఎం జాలీరెడ్డి మూడేళ్ల పాలన మూడు ముక్కల్లో.. క్రాప్ హాలిడే.. పవర్ హాలిడే.. జాబ్ హాలిడేలతో ఏపీలో అభివృద్ధికి శాశ్వత హాలిడే అన్న మాటలు సందర్భోచితంగా ఉన్నాయంటున్నారు.

By
en-us Political News

  
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.