అధికారిక కోతలు మొదలు

Publish Date:Feb 28, 2013

Advertisement

 

కొత్త సంవత్సరంలో జనవరి నెల నుండే అనధికారిక విద్యుత్ కోతలు మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, మార్చి1వ తేది నుండి అధికారికంగా కోతలు మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించింది. హైదరాబాదుతో సహా అన్ని ప్రధాన నగరాలలో రోజుకు 2గంటలు చొప్పున కోతలు విదించబోతున్నారు.

 

ఇక ఇప్పటికే, రోజుకి 3-4గంటలు కోతలు విదిస్తున్న జిల్లా కేంద్రాలలో ఇప్పుడు రోజుకి 4గంటలు, పురపాలక సంఘాలలో 6 గంటలు, మండల కేంద్రాలలో 8 గంటలు, గ్రామాలలో రోజుకి 12 గంటలు విద్యుత్ కోతలు రేపటి నుండి ఖచ్చితంగా అమలుకానున్నాయి. బహుశః ప్రస్తుతం ఉన్న అనధికారిక కోట్లకు ఇవి అదనంగా ఉండవచ్చును. అంటే, ప్రస్తుతం నగరాలలో అనడికారికంగా 2 నుంచి 3గంటలవరకు విద్యుకోతలు అమలవుతున్నాయి. అవి ఇక రోజుకి 5గంటలు అయ్యే అవకాశం ఉంది. నగరాలలో పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే, ఇక పల్లెలో ఎలాఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

 

మర్చి నెల మొదటివారంలో ఇంతభారీ విద్యుత్ కోతలు తప్పనపుడు, మే జూన్ నెలల్లో పరిస్థితిని తలుచుకోవడానికే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావం వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపారాలు, ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులు బాగా దెబ్బతినే అవకాశం ఉంది. తద్వారా నిరుద్యోగం పెరిగి అది సామజిక సమస్యలకు దారి తీసే అవకాశం కూడా ఉంది.

 

గత రెండు మూడు సంవత్సరాలుగా నానాటికి విద్యుత్ సమస్య తీవ్రతరం అవుతున్నదని గ్రహించినప్పటికీ, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేప్పట్టకుండా, కొత్త విద్యుత్ ప్లాంటుల స్థాపనకు పూనుకొనక, కేవలం తెలంగాణా అంశం, పార్టీలో అసమ్మతి రాజకీయాలు వంటి వాటితో కాలక్షేపం చేస్తువచ్చిన ప్రభుత్వం, విద్యుత్ సంక్షోభం నివారణకు కనీస చర్యలు కూడా చేప్పటకపోవడమే నేటి ఈ దుస్థితికి కారణం.

 

దాహం వేసినప్పుడు నుయ్యి త్రవ్వడం మొదలుపెట్టినట్లు, విద్యుత్ సంక్షోభం తీవ్రతరమయిన తరువాత, కిరణ్ కుమార్ గుజరాత్ రాష్ట్రం నుండి గ్యాస్ ఇప్పించమని కోరడం విచిత్రం. ఆ రాష్ట్రంలో ఇదే దుస్థితి నెలకొన్నపుడు అక్కడి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆ పరిస్థితులను ఏవిధంగా అదిగమించాడో తెలుసుకోవాలంటే పార్టీల బేషజాలు, అహం అడ్డొస్తాయి. ప్రభుత్వాల చేతకానితనానికి, నిర్లిప్త వైఖరికి ప్రతీసారీ ప్రజలే మూల్యం చెల్లించక తప్పట్లేదు.

By
en-us Political News

  
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయనీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలనీ కోరుతూ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో నేడో రేపో అరెస్టు కానున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ విశ్లేషకులు ఔననే అంటున్నారు.
పాకిస్తాన్‌లో నీటి కోసం ఆ దేశ హోంమంత్రి జియా ఉల్‌ హసన్‌ ఇంటిని తగలబెట్టారు. ఈ సంఘటన భద్రత, ప్రజల ఆగ్రహావేశాలను అదుపు చేయడంలో పాక్ ప్రభుత్వ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌‌పై భద్రతా బలగాలను ప్రధాని మోదీ ప్రశంసించారు.
వైసీపీ నేత మాజీ సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో సజ్జల ఫ్యామిలీ ఆక్రమించిన 55 ఎకరాల ఫారెస్ట్ భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో టాలీవుడ్ నిర్మాతలు సమావేశం ముగిసింది. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లలో మెజారిటీ సభ్యులు సమ్మె వద్దని థియేటర్లు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని నిర్ణించినట్లు తెలుస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిరవధిక నిరాహా దీక్ష చేపట్టారు. స్టీల్ ప్లాంట్ లో ఆకారణంగా విధుల నుంచి తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిసి దీక్షకు దిగారు.
వచ్చే ఏడాది మార్చి 31లోపు నక్సలిజాన్ని అంతం చేయాలని సంకల్పించినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఎక్స్ వేదికగా తెలిపారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. నంబాల మృతిని అమిత్‌ షా అధికారికంగా ప్రకటించారు.
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. తిరుపతి గంగమ్మ జాతరలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (మే 22) హస్తిన పర్యటనకు వెడుతున్నారు. ఈ సారి ఆయన హస్తినలో మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తాను తీసుకుంటానని, ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ అన్నారు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, నాంపల్లి, చార్మినార్, కోఠి అబిడ్స్, రామంతపూర్, అంబర్‌పేట్ సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వాన పడుతోంది.
కాదేదీ అవినీతికి అనర్హం. ఈ మాట ఏ కవీ అని ఉండకపోవచ్చును కానీ, అది నిజం. చారిత్రక సత్యం. అందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ మినహాయింపు కాదు. అవును. చిన్న చిన్న చిల్లర పనుల్లోనే స్కాములు జరుగతున్న ప్రస్తుత పరిస్థితులలో వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరగక పోతే ఆశ్చర్య పోవాలే కానీ అవినీతి జరిగితే అందులో ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.